పాత సినిమాలకు మన తెలుగులో ఉండే ఆదరణ చాలా బాగుంటుంది అనేది వాస్తవం. పాత సినిమా వస్తుంది అంటే చాలు చాలా మంది అలా సినిమా చూస్తూ టీవీ కి అతుక్కుపోయే పరిస్థితి ఉంటుంది. పాత సినిమాల్లో పాటలకు సంబంధించి ఇప్పటికి అనేక యుట్యూబ్ చానల్స్ కూడా వచ్చాయి. వాటిని ఎక్కువగా కొనుగోలు చేసి యుట్యూబ్ చానల్స్ లో ప్లే చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే టాలీవుడ్ లో ఇప్పుడు ఒక ట్రెండ్ కూడా మొదలయింది. లాక్ డౌన్ సమయంలో కొందరు పాత సినిమాల మీద ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. 

 

దీనితో పాత సినిమాలను టీవీ లో ఎక్కువగా ప్లే చేస్తున్నారు. ఈ తరుణంలో మహేష్ బాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తన తండ్రి నటించిన సినిమాలను ఒక యాప్ ద్వారా అందించడానికి ముందుకు వచ్చాడు మహేష్ అని వార్తలు వస్తున్నాయి. తన తండ్రి సినిమాలు అన్నీ కూడా ఒకే ఫ్లాట్ ఫాం లో అందించే ఆలోచనలో ఉన్నాడట మహేష్ బాబు. దీనికి సంబంధించి అతను ఇప్పటికే హాట్ స్టార్ ని కూడా సంప్రదించాడు అని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాలను ఒక యాప్ లోకి ఎక్కించే ప్రయత్నాలు చేస్తారని సమాచారం. 

 

ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. వాటిల్లో ఎక్కువ సినిమాలకు కృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. విజయ నిర్మలతో చేసిన సినిమాలను కూడా ఒకే ఫ్లాట్ ఫాం మీదకు తీసుకొచ్చి అభిమానులకు అందించాలి అని మహేష్ బాబు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కొందరితో చర్చలు పూర్తి అయిన తర్వాత మొదలుపెదతారని దీనికి సంబంధించి పది రోజుల వర్క్ ఉంటుంది అని అంటున్నారు. కాగా మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: