మన తెలుగులో వస్తున్న సినిమాలకు తమిళంలో వస్తున్న సినిమాలకు చాలా తేడా ఉంటుంది అనే సంగతి తెలిసిందే అక్కడి సినిమాల్లో హీరోలు ఏ పాత్ర చేయడానికి అయినా సరే భయపడే పరిస్థితి ఉండదు. కాని మన తెలుగులో మాత్రం స్టార్ హీరోలు ఇప్పుడు ఏదైనా సినిమా చెయ్యాలి అంటే అది ప్రయోగం అయితే ఒకటికి వంద సార్లు ఆలోచించి దాన్ని సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశాలు ఉంటాయి. టాలీవుడ్ లో ఏ హీరో అయినా సరే భయపడుతూనే సినిమా చేస్తాడు అనే విషయం అందరికి తెలిసిందే. సినిమా ఫ్లాప్ అయితే ఎక్కడ ప్రాణం పోతుందో అనే భయం ఉంటుంది. 

 

పరువు గా కూడా సినిమాను భావించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మన తెలుగులో అందుకే దర్శక నిర్మాతలు కూడా స్టార్ హీరోలతో సినిమాను చెయ్యాలి అంటే ఒకటికీ పది సార్లు ఆలోచన చేసి అప్పుడు సినిమా చేసే సూచనలు ఉంటాయి అనేది అందరికి తెల్సిందే. ప్రస్తుతం కొందరు యువ దర్శకులు కథలను రెడీ చేసుకుని వెళ్ళినా సరే ప్రయోగం ఉంటే మాత్రం సినిమా చేసే అవకాశం లేదని చెప్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దర్శకులను నిర్మాతలు నమ్మినా సరే హీరోలు మాత్రం నమ్మడం లేదని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. 

 

మంచి కథ ఉన్నా సరే సినిమా చేయడానికి ఈ విధంగా భయపడటం ఇప్పుడు చికాకుగా మారింది అగ్ర నిర్మాతలు కూడా ఇప్పుడు మంచి కథ భిన్నంగా ఉంటే తాము చేస్తామని చెప్తున్నా సరే హీరోలు మాత్రం ముందుకు వచ్చి ధైర్యంగా సినిమా చేయడం లేదు అని మీడియా లో కూడా వార్తలు వస్తున్నాయి. ప్రతీ చిన్న విషయాన్ని కమర్షియల్ గా ఆలోచించే కొందరు హీరోలు ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేయడం లేదట .

మరింత సమాచారం తెలుసుకోండి: