లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్ లేక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇంటిపట్టునే ఉండిపోయాడు. ఈ మెగా హీరో ప్రస్తుతం బాక్సర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం వరుణ్ చాలా కష్టపడి మంచి ఫిజిక్ తెచ్చుకున్నాడు. లాస్ ఎంజిల్స్ లో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ టోనీ జెఫ్రీస్ ఆధ్వర్యంలో కఠిన డైట్ చేసాడు. ఇండియన్ బాక్సర్ నీరజ్ గోయత్ ఆధ్వర్యంలో కూడా శిక్షణ తీసుకున్నాడు. ఈ కఠోర శిక్షణతో మంచి బాడీ ఫిట్ నెస్ సాధించాడు వరుణ్. ఇప్పుడు వరుణ్ ఫిట్ నెస్ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.

 

 

ఇప్పిటికే విశాఖపట్నంలో బాక్సర్ మొదటి షెడ్యూల్ పూర్తైంది. ఈలోగా కరోనా దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ అయిపోయి అన్ని సినిమాలతో పాటే బాక్సర్ షూటింగ్ కూడా ఆగిపోయింది. దీంతో ఇప్పటికే నెలకు పైగా వరుణ్ ఇంటిపట్టునే ఉండిపోయాడు. దీంతో ఫిట్ నెస్ పై దృష్టి పెట్టక వరుణ్ ఒళ్లు చేసాడని సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. ఇందులో నిజమెంతుందో తెలీదు కానీ ఈ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అయితే.. ఇవన్నీ పుకార్లేనని వరుణ్ ఫుల్ ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తున్నాడని ఇప్పుడు మరో వార్త రన్ అవుతోంది.

 

 

కరోనా లేకపోతే ఈసరికి షూటింగ్ సగంపైనే పూర్తయ్యేది. రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది కాబట్టి పిట్ నెస్ మెయింటైన్ చేయడం పెద్ద సమస్య కాదు. కాని ప్రస్తుత పరిస్థితులు వరుణ్ కు ఇబ్బందిగానే మారాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయితే మరో సినిమాకు మేకోవర్ మార్చుకునే వాడే. ప్రస్తుతం లాక్ డౌన్ ముగిసి తిరిగి సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేవరకూ వరుణ్ బాడీ మెయింటైన్ చేయక తప్పని పరిస్థితి. తనపై వస్తున్న వార్తలపై వరుణే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: