భారతదేశంలో ప్రస్తుతం లాక్ డౌన్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయం.దీనితో అందరూ ఎవరింటికి వారు పరిమితమయ్యారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వారి పనులను కూడా ఇంటి నుంచి చేయడం మొదలు పెట్టారు. అయితే అనేక మంది ఇంట్లో ఉండడంతో టీవీ చూడడం ఎక్కువ జరిగిందని చెప్పవచ్చు. ఇక అసలు విషయంలోకి వెళ్తే... లాక్ డౌన్ విధించిన తరువాత గత ఐదు వారాల నుంచి ప్రతివారం టివి చూసే వీక్షకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది వచ్చింది. అయితే లాక్ డౌన్ మే 3 తర్వాత ముగుస్తుందని ఊహాగానాలు రావడంతో ఏకంగా 6 శాతం టీవీ వీక్షకులు గత వారంలో తగ్గారని తెలుస్తోంది.

 


అయితే ఈ విషయంపై ప్రధానంగా బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( BARC ) శుక్రవారం రోజున ఈ విషయాన్ని తెలియజేసింది. అయితే హిందూ పురాణ సీరియల్ రామాయణాన్ని రీ టెలికాస్ట్ చేయడంలో ఎక్కువ మంది వీక్షకులు దానిని చూశారని తెలిపింది. మొదట్లో వార్తలు, అలాగే సినిమాలో చూసే వారే ఎక్కువగా ఉన్నారని ఆ సంస్థ తెలిపింది. అయితే ఆ తర్వాత ప్రాథమిక సర్వే ప్రకారం DD ఛానల్ లో టెలికాస్ట్ జరిగిన రామాయణం, క్లాసిక్ సీరియళ్లను ఎక్కువమంది చూడడానికి ఇష్టపడ్డారు అని తెలియజేసింది.

 


కాకపోతే ఏప్రిల్ 24 వ తారీకు నుండి నేటి వరకు తీసుకున్న డేటా లో సాయంత్రం కూడా ఒక ఎపిసోడ్ పునరావృతం కావడంతో దానికి ఎక్కువ వీక్షకులు రావడం లేదని తెలిపింది. మామూలుగా ఉదయం పూట ఎక్కువ మంది ప్రేక్షకులకు సంఖ్య ఉంటుందని ఆ సంస్థ తెలియజేసింది. మామూలుగా ఉదయం పూట రామాయణం వీక్షకుల సంఖ్య వేరే ఛానల్ లోని సినిమాలకు చేరిందని తెలిపింది. అలాగే సాయంత్రం కూడా జరుగుతుందని ఆ సంస్థ తెలిపింది. అది ఎంతలా అంటే రామాయణ చివరి ఎపిసోడ్ ప్రసారం తర్వాత ఏకంగా 46% వ్యూయర్షిప్ ను కోల్పోయింది దూరదర్శన్ ఛానల్. ఇంకోవైపు క్రీడలు కూడా లేకపోవడంతో కేవలం సినిమాలు, వార్తలు వైపే మొగ్గుచూపడం జరిగిందని ఆ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా ఐపీఎల్ వీక్షకులు ఈ లిస్టులో ఎక్కువగా ఉన్నారని చెప్పుకొచ్చింది. చాలామంది ఇప్పుడు టీవీలో వచ్చే కార్యక్రమాల్ని చూడడం ఆపేసి సెల్ లో ఉన్న OTT ఫ్లాట్ ఫామ్ లలో అనేక సినిమాలు ఎపిసోడ్ లు చూడటం జరుగుతోందని తెలుస్తోంది. ఈ కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్ లైన్ పరిశోధనలు ఇప్పటికీ 32 శాతం పడిపోయాయని అలాగే స్మార్ట్ ఫోన్ వినియోగదారుల వినియోగం భారీగా కొనసాగిస్తున్నారని నివేదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: