టాలీవుడ్ లో ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ఇలియానా. ఆమె సినిమాలు ఒకప్పుడు సూపర్ హిట్ అయ్యాయి. అగ్ర హీరోల సినిమాలలో ఆమె నటించింది. ఆ సినిమాలు అన్నీ కూడా హిట్ అయ్యాయి. ఇప్పుడు ఆమె ఒక్క సినిమా చేసినా చాలు అనే భావన లో ఉంది. ఒక్క అవకాశం వచ్చినా చాలు అని ఎదురు చూస్తుంది. ఇందుకోసం తన పరిచయాలు అన్నీ కూడా ఆమె వాడే ప్రయత్నాలు చేస్తుంది. అయినా సరే ఆమె మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించడం కష్టం అయిపోతుంది. 

 

ఆమె ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలను కలిసి సినిమాలు చేస్తాను అని అడిగినా సరే ఆమె మాత్రం నటించడం లేదు. ఎవరు కూడా ఆమెకు అవకాశం  ఇవ్వడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు అగ్ర హీరోలు ఆమె తో ఒకప్పుడు సినిమా చేసిన హీరోలు కూడా ఆమెను వద్దనే అంటున్నారని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య ఆమె ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటుందని ఎవరు అయినా అవకాశం ఇస్తే గోవా నుంచి రావడం కష్టమని హైదరాబాద్ లోనే తన సన్నిహితుల ఇంట్లో ఉంటుంది అని టాక్. 

 

ఆమెకు ఒక యువ దర్శకుడు అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఆమె అసలు ఎక్కడికి వెళ్ళడం లేదని ఇక్కడే ఉంటుంది అంటున్నారు. ఆమెకు మహేష్ బాబు సినిమాలో ఒక అవకాశం వచ్చింది అనే టాక్ కూడా వినపడుతుంది. ఇక ఆమెకు ఐటెం సాంగ్స్ ఆఫర్స్ వస్తున్నాయని కాని తాను చేయను హీరోయిన్ గానే చేస్తాను అని చెప్తున్నట్టు సమాచారం. మరి ఏ ఆఫర్ వస్తుందో ఆమె ఏ సినిమాలో చేస్తుందో చూడాలి. ప్రస్తుతం ఆమె ఒక సినిమా తెలుగులో చేస్తుంది. ఆ సినిమా షూటింగ్ కి వెళ్ళలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: