అటు బుల్లితెరపై ఇటూ వెండి  తెరపై మంచి క్రేజ్ ను సంపాదించుకుని  ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది హరితేజ. ఓ వైపు  బుల్లితెరపై యాంకరింగ్ తో అదరగొడుతునే  మరోవైపు వెండితెరపై విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.  అయితే ప్రస్తుతం లాక్ డౌన్  సందర్భంగా సినిమా షూటింగులు  సీరియల్ షూటింగ్ లు అన్ని ప్రోగ్రాం షూటింగులు కూడా ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో బుల్లితెర సెలబ్రిటీలతో పాటు వెండి తెర  సెలబ్రెటీలు కూడా అందరూ ఇంటికే పరిమితమయ్యాడు. ఇదే సమయంలో సెలబ్రిటీలు అందరూ తమ తమ అభిమానులతో సోషల్ మీడియా వేదికగా దగ్గరవుతూ వస్తున్న విషయం తెలిసిందే. 

 

 

 ఈ క్రమంలోనే బుల్లితెరపై వెండితెర పై ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హరితేజ తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులకు వినోదాన్ని పంచుతూ ముచ్చటించారు . అభిమానులతో హరితేజ ఇంస్టాగ్రామ్ వేదిక ముచ్చటిస్తూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ హరితేజను ఆసక్తికర ప్రశ్న అడిగాడు. హిట్ సినిమాలో  నిజంగానే మీరు సిగరెట్ తాగారా అంటూ ప్రశ్నించగా... దీనిపై స్పందించిన హరితేజ నిజంగానే తాగాను  అంటూ చెప్పుకొచ్చింది. పాత్ర ఎక్కువగా డిమాండ్ చేసినందువల్ల సిగరెట్ తాగక తప్ప  లేదు అంటూ తెలిపింది. 

 

 

 ఇక మరికొందరు నెటిజన్లు కూడా హరితేజను ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే  ఓ నెటిజన్ హరితేజను మీ వయసు ఎంత అని ప్రశ్నించగా... ఈ ప్రశ్నకు సమాధానంగా హరితేజ తనదైన శైలిలో ఆసక్తికర సమాధానం చెప్పింది. నా వయసు గురించి చెప్పినా ఎవరూ నమ్మరు... ఒకవేళ నమ్మిన వినరు... విన్న అర్థం చేసుకోరు... నిజాలు ఎప్పుడూ నిష్టురమే. అయినా కానీ చెబుతాను 24/02/1992 అంటూ తన పుట్టిన తేదీని చెప్పేసింది హరితేజ. దీంతో  అందరూ షాక్ అయ్యారు. ఏంటి హరితేజకు ఇంత తక్కువ వయస్సా  అంటూ ఆశ్చర్యపోయారు. ఇక ఈ చిట్ చాట్ లో భాగంగా అభిమానులు కోరిక మేరకు రెండు మూడు పాటలు కూడా పాడారు హరితేజ.

మరింత సమాచారం తెలుసుకోండి: