నటి రేణు దేశాయ్ కి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అప్పట్లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.. ఆ తర్వాత కొన్ని ప్రోగ్రాంలలో  బుల్లితెరపై కూడా సత్తా చాటారు  రేణుదేశాయ్. పవన్ కళ్యాణ్ తో పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయారు. రేణు దేశాయ్ సినిమాలకు దూరమై ఎన్నో రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పుడు వరకు రేణుదేశాయ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి మాత్రం ప్రయత్నించలేదు. సినిమాలకు దూరమైన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎప్పుడూ దగ్గరగానే ఉన్నారు రేణుదేశాయ్. అయితే సినిమాల్లోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారు అంటూ  పలుమార్లు మీడియా ప్రశ్నించగా మంచి పాత్రలు దొరికితే మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమే అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. 

 

 

 ఇక గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సినిమాతోనే కూడా రేణు దేశాయ్ కూడా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ టాక్ వినిపించిన  విషయం తెలిసిందే. ఇక కొన్ని సినిమాల్లో రేణు దేశాయ్ హీరో తల్లి పాత్ర  పోషించపోతున్నారు అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. వీటన్నింటినీ రేణు దేశాయ్ ఖండిస్తూనే వచ్చింది. ఆ వార్తల్లో వాస్తవం లేదు అని తెలిపింది. అయితే తాజాగా మహేష్ కు తల్లిగా నటిస్తాను అంటుంది రేణూదేశాయ్. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ నెంబర్ వన్ హీరో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 

 అయితే తాజాగా మహేష్ బాబుకు తల్లి పాత్రలో నటించడానికి తాను సిద్ధం అంటూ కామెంట్ చేసింది రేణు దేశాయ్ . రేణుదేశాయ్ కామెంట్స్  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. సినిమాల్లో  తల్లి పాత్రలకు సంబంధించి  పలు కామెంట్స్  చేసింది. ఈ సందర్భంలో కేవలం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడికే తల్లి పాత్ర చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం రేణూదేశాయ్ చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: