ఏదైనా పాటని ఒక్కరు లేదా ఇద్దరు మహా అయితే ముగ్గురు సింగర్స్ పాడుతూ ఉంటారు. కానీ ఒక పాటని దేశవ్యాప్తంగా ఉన్న గొప్ప సింగర్స్ 100 మంది  కలిపి వివిధ భాషల్లో పాడితే... అంతటి అద్భుతమైన వేరే లేదు అని చెప్పవచ్చు. భారతదేశంలో ఇలాంటిది జరగనుంది . దేశంలోని దిగ్గజం సింగర్స్ అందరు  దేశం కోసం గళం విప్పనున్నారు . దేశంలో కరోనా వైరస్ కు ఎదురొడ్డి పోరాడుతున్న సైనికులకు మద్దతుగా 100మంది ప్రముఖ గాయకులు గళం కలిపి ఒక పాటను 14 భాషల్లో ఆలపించారు. ప్రధానమంత్రి కేర్ ఫండ్స్ కి కరోనా పై పోరాడుతున్న సైనికులకు  వ ఈ పాట అంకితం చేసేందుకు భారత దేశ వ్యాప్తంగా ఉన్న సింగర్స్ అందరూ నిర్ణయించారు . 

 


 ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ నుంచి 100 మంది ప్రముఖ గాయకులు.. దేశంలోని 14 భాషల్లో  ఈ గీతాన్ని ఆలపించడం ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. మే 3వ తేదీన ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ తరపున 100మంది ప్రముఖ గాయకులు పాడుతున్న ఈ గీతాన్ని దిగ్గజ గాయని లతా మంగేష్కర్ దేశ ప్రజలకు కరోనా  వైరస్ పై పోరాటం చేస్తున్న వారికి అంకితం ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని లెజెండరీ సింగర్ ఆశాభోస్లే చెప్పుకొచ్చారు. దేశ ప్రజల మనోభావాలని వివిధ సంగీత ప్రక్రియలో వినిపించడానికి భారతదేశ కళాకారులు ఎప్పుడూ ముందుంటారు అంటూ ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కరోనా  వైరస్పై పోరాటంలో దేశం మొత్తం ఒక తాటిపైకి వచ్చి పోరాటం చేస్తోంది అంటూ తెలిపారు. 

 


 ఇదే స్ఫూర్తితో ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ నేతృత్వంలో గాయకులకు ఉన్న దేశభక్తి అంకిత భావాన్ని కూడా తెలియజేస్తూ దేశంలోని ప్రముఖ సింగర్లు వందమంది కలిపి ఒకే పాటను పాడి ఒకే దేశం ఒకే వాణి అని చాటిచెప్పనున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో సింగర్లు అందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో అందరు సింగర్లు తమ ఇంటి దగ్గర నుంచి ఈ పాటను రికార్డు చేశారు. ఇలా ఏకంగా దేశ వ్యాప్తంగా ఉన్న 100 మంది ప్రముఖ గాయకులు ఒకే పాటని 14 భాషల్లో ఒకేసారి ఆలపించడం దేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: