బండ్ల గణేష్... టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయన తెలియనివారు ఉండరు అంటే నిజంగా అతిశయోక్తి అని చెప్పవచ్చు. దీనికి కారణం ఆయన ఒక నటుడు అలాగే నిర్మాత కూడా. నిజానికి ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతారో కూడా ఎవరికీ తెలియదు. బండ్ల గణేష్ కమెడియన్ స్థాయి నుంచి అగ్ర నిర్మాత స్థాయికి ఎదిగి కొద్దికాలంలోనే వచ్చిన పేరుని ఆయన కాపాడుకోలేక పోయారు. కనీసం 25 సినిమాల్లో నటించిన ఆయన రవితేజ నటించిన ఆంజనేయులు చిత్రంతో నిర్మాతగా మారాడు బండ్ల గణేష్. అయితే ఆ తర్వాత తీన్మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరమ్మాయిలతో, టెంపర్ మొదలగు చిత్రాలను భారీ బడ్జెట్ తో నిర్మించారు.

 


ఈయనకు బయట చాలామంది ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండడంతో నిర్మాతగా బండ్ల గణేష్ బడా నిర్మాత అని ఇండస్ట్రీలో అనిపించుకున్నాడు. అయితే ఒక సమయంలో పవన్ కళ్యాణ్ తో తీన్మార్, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలను నిర్మించడంతో ఆయనకు భక్తుడిగా మారిపోయాడు బండ్ల గణేష్. ఎప్పుడైనా సరే సమయం దొరికితే చాలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూనే ఉంటాడు బండ్ల గణేష్. అయితే ఏ నిర్మాత అయినా సరే లాభాలు నష్టాలు ఉంటాయి. ఈయన కూడా అదే పరిస్థితి ఎదురైంది అని చెప్పవచ్చు. పాలిటిక్స్ లోకి వచ్చి అట్టర్ ప్లాప్ కూడా అయ్యారు. నిజానికి సినిమాల్లో కమెడియన్ గా నిలబడ లేక పోయినా రాజకీయాల్లోకి వచ్చి ఒక కమెడియన్ తీసుకొని ఆయన రాజకీయాల నుంచి బయటికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో సీటు రాకపోతే పీక కోసుకుంట అని బహిరంగ సవాల్ చేయడం తో ఆయనకు సీటు ఇవ్వకపోవడంతో అక్కడ ఒక కమీడియన్ గా మారిపోయాడు బండ్ల గణేష్.

 

ఇక ఆ ఎన్నికలు మొత్తం ముగిసిన తర్వాత నాకు బుద్ధొచ్చింది బాబోయ్... ఇక రాజకీయాల జోలికి వెళ్లను సినిమాల చేసుకుంటానని పౌల్ట్రీ పరిశ్రమ నడుపుకుంటూ తన పాత పని మొదలు పెట్టిన బండ్ల గణేష్ మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ లో సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బ్లేడు పట్టుకొని ఆయన కనిపించారు. అయితే ఈ మధ్య ఎందుకో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ అనేక సార్లు పోస్ట్ చేస్తూ వచ్చాడు. అవి ఎలా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ ని మించిన పొగడ్తలను కేసీఆర్ పై కురిపిస్తున్నాడు బండ్ల గణేష్. అయితే తాజాగా వాటిపై ట్రోల్స్ ఎక్కువవడంతో ఆయన స్పందించారు. నాపై వచ్చే విమర్శలు నేను ఎప్పుడూ చదవను ఎందుకంటే అవి నేను అంటే పడని వారు రాసినవి కాబట్టి. నేను ఏంటో నాకు మాత్రమే తెలుసు నా అభిప్రాయాన్ని రాస్తూ ఉంటాను నేను ఎవరికీ బానిసను కాను అంటూ ఒక ట్వీట్ చేశారు బండ్ల గణేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: