కేవలం యూత్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తూ స్టార్ క్రేజ్ దక్కించుకున్న హీరో పవన్ కళ్యాణ్. ఈయన పేరు వినగానే యూత్ లో పూనకాలు వచ్చేస్తాయి. 20 ఏళ్ల క్రితం కేవలం కుటుంబ కథా చిత్రాలతోనే సినిమాలు వస్తున్న టైంలో హీరో యూత్ ఫుల్ గాయ్ లా కనిపిస్తే ఎలా ఉంటుంది అనే ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ వరుసగా అవే సినిమాలు చేస్తూ వచ్చాడు. యూత్ ఫుల్ సబ్జెక్ట్ దానికి ఓ లవ్ స్టోరీ ఇదే పవర్ స్టార్ సక్సెస్ ఫార్ములా. అలా అని తీసి పారేయడం కాదు పవన్ కళ్యాణ్ కు పర్టిక్యులర్ గా ఒక స్టైల్ ఉంటుంది. అది ఎవరికీ రాదు కూడా.. ఆ స్టయిలే పవర్ స్టార్ అంటే వాళ్లకు పిచ్చి అనిపించేలా చేసింది.

 

పాతిక సినిమాల అనుభవంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు తన స్టైల్ కు విరుద్ధంగా సినిమాలు తీయలేదు. తన స్టైల్ యాక్టింగ్ తోనే పవర్ ఫుల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. నటుడు అనిపించుకోవాలంటే అన్ని పాత్రలు చేయాలి. అందుకే పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా పవన్ ను పౌరాణిక పాత్రల్లో చూడాలని అనుకుంటున్నారు. తను సినిమాలు సరదాగా చేస్తానని చెప్పిన పవన్ పౌరాణిక పాత్రల్లో కూడా మెప్పించే అవకాశం ఉంది. ఆ సినిమాలు పవన్ ఒప్పుకోవడం కష్టమని చెప్పొచ్చు.      

 

ప్రయోగాలకు పవన్ ఎప్పుడు సిద్ధమే కానీ సినీ కెరియర్ కేవలం తన మార్క్ ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైన పవన్ ఇలాంటి టైం లో రిస్క్ తీసుకోవడం కష్టమని చెప్పొచ్చు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత క్రిష్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే. ఆ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరక్షన్ లో పవర్ స్టార్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: