కరోనా ప్రళయానికి దేశం మొత్తం స్తంభించిపోయింది. ఈ మహమ్మారి ప్రకోపానికి వ్యవస్థలన్నీ కుదేలైపోయాయి. ముఖ్యంగా ఎన్నో రంగాల్లో పనిచేసే అసంఘటిత కార్మికులు పనులు లేక ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా ముందుకొచ్చి అనేకమందిని ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నారు. ఇందులో సినీ పరిశ్రమ కూడా ఉంది. తెలుగు సినీ హీరో నందమూరి బాలకృష్ణ కూడా తన వంతు సాయం చేస్తూ తన ఔదార్యం చాటుకుంటున్నారు.

 

 

నేడు కార్మిక దినోత్సవం సందర్భంగా బాలకృష్ణ స్పందించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో పని చేసే కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. హాస్పిటల్ లో పనిచేస్తున్న 400 మంది శానిటేషన్, హౌస్ కీపింగ్ కార్మికులకు నిత్యావసరాల కిట్లను అందించారు. దాదాపు 10 నుంచి 12 రోజుల పాటు ప్రతి కుటుంబానికి సరిపోయేలా సరుకులను అందించారు. బాలకృష్ణ చైర్మన్ గా ఉన్న ఈ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లోని కార్మికులకు నిత్యావసరాలు అందించటం రీసెంట్ గా ఇది రెండోసారి. ఈమధ్యే హాస్పిటల్ లో పనిచేసే కార్మికులకు నిత్యావసరాలు అందించారు.

 

 

ఆపత్కాలంలో స్పందించే సినీ సెలబ్రిటీల్లో బాలయ్య కూడా ముందువరుసలో ఉంటారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు విరాళంతో పాటు.. సినీ కార్మికులను ఆదుకోవడం కోసం సీసీసీకి కూడా 25 లక్షలు విరాళం అందించిన విషయం తెలిసిందే. బాలయ్య ఔదార్యంపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా బాలయ్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హీరోలు ఇటువంటి చారిటీస్ చేస్తే అభిమానులు కూడా వారిని ఆదర్శంగా తీసుకుని సాయం చేస్తారనడంలో సందేహం లేదు. ఈ విషయంలో బాలయ్య గతంలోనే తన అభిమానులకు పిలుపిచ్చారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: