అందాల రాక్షసి సినిమాతో కాస్త డీ గ్లామర్ పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందాల లావణ్య త్రిపాఠి. అంతేకాదు మొదటి సినిమాతో ఇండస్ట్రీ దృష్ఠిని ఆకర్శించడమే కాకుండా దర్శక ధీరుడు రాజమౌళి వంటి అగ్ర దర్శకుడి ప్రశంసలు దక్కించుకుంది. కాని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. చేయడానికి సినిమాలైతే చాలానే చేసినప్పటికి ఎందుకనో టాప్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకోలేకపోయింది. అందుకు కారణం అందాల రాక్షసి తర్వాత యంగ్ హీరోల సినిమాలలో వరసగా అవకాశాలు కారపోవడమే. మంచి విష్ణు సినిమా హిట్ అయిన మనం సినిమాలో గెస్ట్ రోల్ పోషించినా అవి తనకి అంతగా ఉపయోగపడలేదు. 

 

అయితే నాగార్జున సరసన నటించిన సోగ్గాడే చిన్ని నాయన మాత్రం లావణ్య కెరీర్ లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచిపోతుంది. అలాగే నాని మారుతి కాంబినేషన్ లో వచ్చిన భలే భలే మగాడివోయ్ కూడా. కాని ఇప్పటి వరకు లావణ్య  త్రిపాఠి డీప్ లిప్ లాక్స్ గాని హాట్ అండ్ బోల్డ్ సీన్స్ కాని చేసింది లేదు. అదే తనకి మైనస్ అయిందని గ్రహించిందేమోగాని మేకర్స్ కి సూటిగా తన లిమిటేషన్స్ గురించి క్లారిటి ఇస్తోందట.

 

ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలు చేయని లావణ్య, స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే బికినీకి కూడా రెడీ అంటుందని తాజా సమాచారం. అలాగే హీరోయిన్ ఓరియొంటెడ్ సినిమాలుగా ఎక్కువగా వస్తున్న మళయాల సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తుందట. అయితే లావణ్యకి అనుకున్నట్టుగా అవకాశాలు మళయాళ సినిమాలలో వస్తాయా లేదా చూడాలి. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి సందీప్ కిషన్ సరసన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాలో హాకీ క్రీడాకారిణిగా కనిపిస్తుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ నటించబోయో సినిమాలో కూడా నటించే అవకాశం ఉందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి లావణ్య గనక బికినీలో కనిపిస్తే రచ్చ మామూలుగా ఉండదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: