టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా హీరోగా రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ని క్రేజ్ ని దక్కించుకున్న మహేష్, ఆ తరువాత నుండి తన ఆకట్టుకునే టాలెంట్ తో ఒక్కో అవకాశాన్ని అందుకుని ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అతి పెద్ద స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇకపోతే మొదటి నుండి మహేష్ బాబుకు యూత్, క్లాస్ ఆడియన్స్ తో పాటు లేడీస్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది అనే చెప్పాలి. 

IHG

ఇక మహేష్ బాబుకు నమ్రత తో పెళ్లి జరిగిన తరువాత మన తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది అమ్మాయిల గుండెలు బద్దలు అయ్యాయి. చూడడానికి అచ్చం హాలీవుడ్ హీరోలా ఉండే ఆరడుగుల అందగాడు మహేష్ ని దాదాపుగా ఇష్టపడని అమ్మాయి ఉండదు. ఇక ఇటీవల కాలంలో పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సక్సెస్ఫుల్ మూవీస్ లో నటించిన విజయ్ దేవరకొండ కు కూడా లేడీస్ లో మంచి ఫాలోంగ్ ఉందనే చెప్పాలి. 

 

ఒకానొక సమయంలో విజయ్ నటించిన టాక్సీ వాలా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా భీమవరం వెళ్లిన విజయ్ కి స్వాగతం పలుకుతూ ఎంతో మంది అమ్మాయిలు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ఒక్క ఘటన చాలు విజయ్ కు లేడీస్ లో ఉన్న క్రేజ్ ఏంటో చెప్పడానికి అని అంటున్నారు విశ్లేషకులు. ఇక మొదటి నుండి మంచి యూత్ ఫుల్ క్యారెక్టర్స్ తో పాటు కొంత బోల్డ్ గా ఉండే పాత్రల్లో కూడా నటించిన విజయ్ యొక్క సహజ నటన, ఆకట్టుకునే అందం అతడిని అమ్మాయిలకు మరింతగా చేరువ చేశాయని అంటున్నారు. ఇక మొత్తంగా చెప్పాలంటే టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తరువాత ఆ రేంజ్ లో లేడీస్ ఫాలోయింగ్ కలిగిన వ్యక్తి విజయ్ అని చెప్తున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: