ఇటీవల టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఒక సూపర్ హిట్ మూవీలో ఛాన్స్ కొట్టేసి, హీరోయిన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని, తన అందం అభినయంతో ఎందరో అభిమానుల, ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఒక యువ నటి, ఆ తర్వాత అక్కడక్కడా కొన్ని సినిమాల్లో నటించింది. అయితే ఎక్కువగా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సాగుతున్న ఈ యువనటి, కేవలం నటిగానే కాక డాన్సర్ గా కూడా మంచి పేరు సంపాదించింది. 

 

యువతలో మంచి క్రేజ్ సంపాదించిన ఈ నటి, ఇటీవల తన వద్దకు వచ్చిన చాలా బడా సినిమాలను సైతం పక్కకు నెట్టేసిందని వార్తలు రావడం జరిగింది. దానితో ఆమె పై పలు పుకార్లు వెల్లువెత్తాయి. ఆమెకి కోపం ఎంతో ఎక్కువ అని, మంచి అవకాశాలు వచ్చి నా కెరీర్లో స్థిరపడాలనే ఉద్దేశం ఆమెకు లేనట్లు ఉందని, అందుకే తన వద్దకు వస్తున్న ఎన్నో మంచి ఆఫర్లను వదులుకుంటోందని కొందరు నిర్మాతలు కూడా బహిరంగంగా ఆమె పై విమర్శలు ఎక్కుపెట్టిన ట్లు సమాచారం. 

 

అయితే హీరోయిన్ గా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన తనకి, కొన్ని నియమాలు, పద్ధతులు ఉన్నాయని, ఏదో ఒక పెద్ద సినిమా అవకాశం వచ్చింది కదా, అని ఆనందంతో ఎగిరి గంతేసి, మిగతా హీరోయిన్ల మాదిరిగా తాను మాత్రం సగం సగం బట్టలు వేసుకోవటం, అక్కడక్కడా సీన్స్ లో బట్టలిప్పి అర్ధ నగ్నంగా నటించడం, అలానే మూతులు నాకుతూ రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం వంటివి చేయలేనని తేల్చి చెప్పేసిందట. ఇంతకీ ఆ నటి ఎవరా అంటూ ఇప్పటికే కొద్దిరోజులుగా మన టాలీవుడ్ ప్రేక్షకులు పలు విధాలుగా చర్చలు మొదలెట్టేశారు. మరి రాబోయే రోజుల్లో అయినా సదరు నటి తన పంథా మార్చుకుని సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుందో లేదో చూడాలని అంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: