మూడేళ్ల క్రితం వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో మళ్లీ టాలీవుడ్ కి హీరో గా రంగప్రవేశం చేసిన చిరంజీవి, ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకుని తన క్రేజ్, స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. ఇక ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి వంటి పేట్రియాటిక్ మూవీలో నటించిన మెగాస్టార్, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మెగాస్టార్ సరసన జోడి కడుతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ లు కలిసి సంయుక్తంగా ఎంతో భారీగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఇక ఇటీవల లాక్ డౌన్ నేపథ్యంలో మిగతా సినిమాలతో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా నిలుపుదల చేయబడింది. 

 

కాగా తమ సినిమా ఇప్పటి వరకూ 40 శాతం షూటింగ్ జరుపుకుందని తెలిపిన దర్శకుడు కొరటాల, ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఇటీవల రామ్ చరణ్ ని సంప్రదించగా, ఆయన ఆ పాత్రలో నటిస్తానని చెప్పారని, అయితే మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక హీరోగా నటిస్తున్న చరణ్, ప్రస్తుత పరిస్థితుల్లో మా సినిమాలో ఎంతవరకు నటిస్తారు అనేది ముందు ముందు తెలుస్తుందని, అలాగే ఇటీవల ఒక సందర్భంలో మహేష్ బాబు ని కలిసి ఈ సినిమాలోని ఆ పాత్ర గురించి చెప్పగా, అవసరం అయితే ఆయన కూడా నటిస్తానని చెప్పారని కొరటాల అన్నారు. ఇక ఈ విషయాలు అటుంచితే, ఈ సినిమా సక్సెస్ కు ఒక సమస్య అడ్డంకి కానుందని సమాచారం. ఇప్పటివరకూ వచ్చిన కొరటాల శివ సినిమాలన్నీ కూడా ఎక్కువ నిడివి కలిగినవే అని చెప్పాలి. 

 

అదేవిధంగా ఆచార్య సినిమా కూడా దాదాపుగా రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు పైగా నిడివి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంత భారీ లెంగ్త్ కలిగిన సినిమాని, ప్రేక్షకులు ఎంతవరకు థియేటర్స్ లో ఓపికగా చూడగలరు అనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమాలో మంచి కథా, కథనాలు ఉంటే గనుక లెంగ్త్ ఎంత అనేది పెద్ద సమస్య కాదని, గతంలో కూడా ఎంతో ఎక్కువ లెంగ్త్ కలిగిన సినిమాలు సక్సెస్ సాధించిన ఘటనలు అనేకం ఉన్నాయి అని అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: