సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకెళుతున్న ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తండ్రి సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ నట వారసత్వంతో చిన్నప్పుడే సినిమాల్లోకి అడుగు పెట్టిన మహేష్, ఆ తర్వాత హీరోగా రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తొలి సినిమానే మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, రెండో సినిమాతో నాలుగేళ్ల కొడుక్కి తండ్రిగా ప్రయోగాత్మకమైన సినిమాలో నటించి మరొక విజయాన్ని అందుకున్నారు మహేష్. ఇక ఆ తర్వాత నుండి కెరీర్ పరంగా కొంత ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగిన మహేష్ కు, ఆమధ్య చాలానే ఫ్లాప్ లు వచ్చాయి. 

 

అయితే ఇటీవల వరుసగా కొంత ప్రయోగాత్మకంగా సినిమాలు చేస్తూ ముందుకు సాగిన మహేష్, ఇకపై అటువంటివి చేయకూడదని కృతనిశ్చయంతో వ్యవవహరించినట్లు తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం ఒకవేళ తాను ప్రయోగం చేసినపుడు ఆ సినిమా సక్సెస్ అయితే పర్వాలేదని, అదే ఒకవేళ ఫెయిల్యూర్ అయితే మాత్రం దాని వల్ల నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు కలిగే నష్టం వలన ఎందరినో ఇబ్బందుల్లోకి నెడుతోందని భావించిన మహేష్, ఇకపై తప్పకుండా తన సినిమాల్లో కమర్షియల్ అంశాలు ఉండేలా ప్లాన్ చేసారు. ఇక ఆ తరువాత వచ్చిన భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాల్లో మంచి మెసేజ్ తో పాటు కమర్షియల్ హంగులు మాత్రం మహేష్ మిస్ కాలేదు. 

 

అందుకే అవి మూఢ కూడా మంచి సక్సెస్ సాధించి, మొత్తంగా మహేష్ కి హ్యాట్రిక్ విజయాలు అందించాయి. అయితే మహేష్ తీసుకున్న ఆ గట్టి నిర్ణయమే ఆయనకు వరుసగా విజయాలు అందించేలా చేస్తూ, ఆయనను నెంబర్ వన్ స్థానానికి మరింతగా చేరువ చేస్తున్నాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక అతి త్వరలో పరశురామ్ దర్శకత్వంలో తదుపరి సినిమా చేయనున్న మహేష్, ఆపై రాజమౌళి దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: