నందమూరి బాలకృష్ణ సినీ జీవితం బోయపాటికి ముందు బోయపాటికి తర్వాత అని విడదీయవచ్చు. గతంలో బాలయ్య వరుస ఫ్లాప్ లతో చాలా గడ్డు కాలం ఎదుర్కొన్నాడు. ఎన్నో సినిమాలు అట్టర్ ఫ్లాప్ కాగా…. అప్పట్లో థియేటర్లో కి ఎప్పుడు వచ్చాయో.... ఎప్పుడు వెళ్లాయో కూడా తెలియని కొన్ని చిత్రాలు కూడా లిస్టులో ఉన్నాయి. అయితే బోయపాటి 'సింహ' సినిమా తో బాలయ్య కెరీర్ కు మళ్లీ ఊపిరి ఊదాడు అనే చెప్పాలి.

 

సినిమాల్లో బాలకృష్ణ నట విశ్వరూపాన్ని చూసిన నందమూరి ఫ్యాన్స్ నిజంగానే ఒక సింహం వేటకు వస్తే ఎలా ఉంటుందో అంత రౌద్రం బాలయ్య సినిమాలో కనబరిచారు. తర్వాత మళ్లీ బోయపాటి దర్శకత్వంలో చేసిన 'లెజెండ్' సినిమా అయితే ఇక ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టింది. ఇక రెండు భారీ హిట్లు తర్వాత బాలయ్య బాబు కి గత రెండు సంవత్సరాల నుండి వరుసగా బాక్సాఫీసు వద్ద ఫ్లాపులు పడుతున్నాయి.

 

'జై సింహా' పండగ సీజన్ లో పర్వాలేదనిపించినా.... ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించిన రెండు బయోపిక్ చిత్రాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. మళ్లీ బాలయ్య కథ మొదటికి వచ్చింది అనుకుంటున్న సమయంలో బోయపాటి శీను దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి బాలయ్య బాబు రెడీ అయిపోయాడు.

 

ఇలాంటి సందర్భంలో తాజాగా సినిమాలో బాలయ్య బాబు అఘోర పాత్రలో కనిపించనున్నట్లు బోయపాటి క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన బోయపాటి గత రెండు సినిమాల కంటే సినిమా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలిపారు. ఇక ఈసినిమాలో కూడా డ్యూయల్ రోల్ లో బాలయ్య కనిపించనున్నారని బోయపాటి తెలిపారు.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: