టాలీవుడ్ లో రౌడీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సినిమాలకు ఎప్పుడు ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా యువత వాటిని ఎక్కువగా చూస్తూ ఉంటారు. సినిమా కథ విషయంలో ఎప్పుడు ఒక ఆసక్తిగా ఉంటుంది. యువత వాటిని ఎక్కువగా ఆదరించడమే కాదు సినిమాలో లీనం అయి మరీ చూస్తూ ఉంటారు. ఇక అలాంటి సినిమాలు చేసిన హీరోలకు కూడా అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఏర్పడుతుంది. ప్రధానంగా కొందరు హీరోలు అయితే ఆ కథలకు సరిగా సరిపోతారని అంటూ ఉంటారు ప్రస్తుత యువ హీరోల్లో ఎవరు అయినా అంతగా అమ్మాయిలకు రౌడీ గా దగ్గరయ్యారు అంటే... 

 

అక్కినేని వారి హీరో అక్కినేని నాగ చైతన్య బాబు నటించిన ఆటో నగర్ సూర్య మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాలో అతని నటన చాలా బాగా ఆకట్టుకుంది. విజయవాడ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాల్లో అతని నటన చాలా బాగా ఆకట్టుకుంది. ప్రధానంగా యాక్షన్ సన్నివేశాల్లో యూత్ ని బాగా ఆకట్టుకున్నాడు అతను. ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి. దేవా కట్టా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆసియా లో అతిపెద్ద ఆటో నగర్ నేపధ్యంలో వచ్చింది. 

 

ఇక ఈ సినిమాలో రౌడీ యుజం గురి౦చి మోసం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆటో నగర్ ని తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలి అనుకునే ఒక మేయర్ ని టార్గెట్ చేసి ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా తర్వాత అతనితో యాక్షన్ సినిమాలను ఈ తరహా లో తీయడానికి దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపించారు. ఈ సినిమా తర్వాత అతని రేంజ్ కూడా పెరిగింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం అతను చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: