మాములుగా మాస్ మహారాజ రవి తేజా అనగానే మనకు చాలా వరకు గుర్తుకు వచ్చేది అతను కామెడి. యాక్షన్ సన్నివేశాలు అంటే మనకు అంతగా రవి తేజాను చూసిన సందర్భం తెలియదు. కాని అలాంటి హీరో ని కూడా యాక్షన్ హీరో ని చేసారు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వంలో వచ్చిన భద్ర సినిమాలో రవి తేజా నటన చాలా బాగా ఆకట్టుకుంది. ఆ సినిమాలో రవి తేజా ఫ్యాక్షన్ బాక్ డ్రాప్ లో ఉన్న కుటుంబానికి దగ్గరగా ఉంటాడు. తన ఫ్రెండ్ అన్నయ్యకు ఫ్యాక్షన్ తో సంబంధం ఉంటుంది. 

 

తన స్నేహితుడ్ని కాపాడుకోవడానికి  రవి తేజా నటించిన సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి ప్రేక్షకులను. ఆ సినిమాలో రవి తేజా కత్తి కూడా పట్టుకుంటాడు. అప్పటి వరకు అతను కత్తి పట్టిన సన్నివేశాల్లో నటించిన సందర్భం ఎప్పుడు లేదు. అయినా సరే చాలా బాగా నటించాడు అతను. విలన్ లను అతను ఎదుర్కొన్న తీరు కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. అప్పటి వరకు ఉన్న రవి తేజా వేరు అప్పటి నుంచి ఉన్న రవి తేజా వేరు అని చెప్తూ ఉంటారు ఆయన అభిమానులు. ఆ సినిమాలో చేయడం ఒక సవాల్ అయినా సరే అతను ఎక్కడా కూడా భయపడకుండా నటించాడు. 

 

ఆ సినిమాలో ఉండే కొన్ని సీన్స్ ఇప్పటికి మనకు కనపడుతూ ఉంటాయి. రవి తేజా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా అది. ఆ సినిమా తర్వాత అతని రేంజ్ కూడా పెరిగింది అని చెప్తూ ఉంటారు. ప్రస్తుతం సరైన హిట్ లేక రవి తేజా బాగా ఇబ్బంది పడుతున్నాడు. అతనితో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అంటున్నారు. ఆయన సినిమాలకు పెట్టుబడి పెట్టే నిర్మాతలు కూడా పెద్దగా కనపడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: