ఈఏడాది సంక్రాంతి రేస్ కు విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినా ఆసినిమాను 100 కోట్ల నెట్ కలక్షన్స్ మూవీగా మార్చడంలో అనీల్ రావిపూడి వ్యూహాలు చాలబాగా పనిచేసాయి. వాస్తవానికి ‘అల వైకుంఠపురములో’ మూవీతో పోటీ పడ్డ ఈమూవీ సక్సస్ సాధించడంతో అనీల్ రావిపూడి వరస హిట్ ట్రాక్ సెంటిమెంట్ కొనసాగుతూ ఇప్పటి వరకు ఫెయిల్యూర్ అన్న పదాన్ని చూడని దర్శకుల లిస్టులో అనీల్ రావిపూడి కొనసాగుతున్నాడు.


ప్రస్తుతం షూటింగ్ లు ఆగిపోయి లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితులలో ఈక్రేజీ డైరెక్టర్ తన స్వస్థలం అయిన ప్రకాశం జిల్లాలోని చిలకూరి వారి పల్లెలో తన ఇంటి మేడ పై కూర్చుని ‘ఎఫ్‌ 3’ కథ వ్రాస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఒకప్రముఖ ఛానల్ కు ఈదర్శకుడు ఇచ్చిన ఆన్ లైన్ ఇంటర్వ్యూలో టాప్ హీరోల నెగిటివ్ పాయింట్స్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.


ప్రతి హీరోకు వారి బాడీ లాంగ్వేజ్ కు సంబంధించి పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్ రెండు ఉంటాయని అయితే దర్శకుడు అన్నవ్యక్తి నెగిటివ్ పాయింట్స్ ఎక్కడా బయట పడనీయకుండా టోటల్ పాజిటివ్ పాయింట్స్ ఎలివేట్ అయ్యేలా దర్శకుడు చాల తెలివిగా మేనేజ్ చేయాలి అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు టాప్ హీరోలతో సినిమాలు తీయడం అంటే కత్తిమీద సాము లాంటిదని బ్యాలెన్స్ నిలుపుకుంటూ అశ్లీలత లేకుండా ఫ్యామిలీ ప్రేక్షకులు సరదాగా నవ్వుకుంటూ చూడగలిగిన జంధ్యాల మార్క్ సినిమాలు తీయడం తన ధ్యేయం అని అంటున్నాడు.


ఇదే సందర్భంలో ‘ఎఫ్ 3’ కథ గురించి లీకులు ఇస్తూ ఈసారి పెళ్లి కాకుండా మరో కథతో వస్తున్నానని. ‘ఎఫ్ 2’ లో నటించిన వెంకటేష్‌ వరుణ్ తేజ్‌ లతో పాటు తమన్నా మెహ్రీన్ కూడా ఇందులో ఉంటారని కన్ఫర్మ్ చేసాడు. అయితే ఇందులో కూడ మరో ఫ్రస్టేషన్ ఉంటుందని అది ఏమిటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని అంటున్నాడు. వాస్తవానికి ఈకథలో మూడో హీరోకు చోటు దక్కుతుందని తాను మొదట్లో భావించానని అయితే కథ వ్రాయడం మొదలు పెట్టాక ఇప్పుడు ఈకథలో మూడవ హీరోకు ఛాన్స్ దక్కేలా లేదు అంటూ లీకులు ఇస్తున్నాడు. తెలుగులో సీక్వెల్స్ గా వచ్చిన సినిమాలు ఇప్పటి వరకు విజయం సాధించని నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నా ఆ సెంటిమెంట్ ను లెక్క చేయకుండా అనీల్ రావిపూడి చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు సక్సస్ అవుతుందో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: