నందమూరి బాలకృష్ణ అనగానే ఫ్యాక్షన్ సినిమాలు మన కళ్ళ ముందు ఉంటాయి అనేది వాస్తవం. ఆయన ఎలాంటి సినిమాలో అయినా సరే నటించడానికి భయపడకుండా సినిమాలో నటిస్తూ ఉంటారు. అది ఎలా ఉన్నా సరే నటనకు పూర్తి న్యాయం చేస్తూ ఉంటారు. బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా ఒకటి ఉంది. అదే... చెన్న కేశవరెడ్డి. ఈ సినిమాలో బాలకృష్ణ నటనకు ఫ్యాక్షన్ సన్నివేశాలకు ఒక రేంజ్ ఉంది. ప్రతీ సన్నివేశం లో బాలకృష్ణ మాట్లాడిన మాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రాయలసీమ రెడ్లు అయితే బాలకృష్ణ కు పాలాభిశేషం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేది వాస్తవం. 

 

బాలకృష్ణసినిమా తర్వాత ఎక్కువగా ఫ్యాక్షన్ సినిమాల్లో నటించాలి అని చూసినా సరే అది రెగ్యులర్ గా సాధ్య౦ కాలేదు. ఆ సినిమాలో సత్తిరెడ్డి అంటూ బాలయ్య నుంచి వచ్చిన ఒక్క మాట సినిమాకే హైలెట్ గా నిలిచింది అనేది అక్షరాలా నిజం. ఆ సినిమాలో బాలకృష్ణ... ఒక మనిషిని తిండే కాదు పగ కూడా బ్రతికిస్తుంది అంటూ బాలయ్య నోటి నుంచి వచ్చిన డైలాగ్ కి మంచి ఆదరణ లభించింది. ఇలా చాలా డైలాగులు ఆ సినిమాలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అనేది వాస్తవం. ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే బాలయ్య రేంజ్ మాత్రం బాగా పెరిగింది. ఇక పగ ఎలా ఉంటుంది అనేది ఆ సినిమాలో బాగా చూపించారు.

 

25 ఏళ్ళు జైల్లో ఉన్నా సరే బాలకృష్ణ లో పగ తగ్గదు. ఆ సన్నివేశాలలో బాలయ్య నటన చాలా బాగా ఆకట్టుకుంది. అలా ఆ తర్వాత కొందరు హీరోలు ప్రయోగాలు చెయ్యాలి అని చూసినా సరే ఎక్కడ ఫ్లాప్ అయితే మా పరువు పోతుందో అని భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: