బిల్లా.. ఈ సినిమా ఎంత అద్భుతం.. అసలు సైలెంట్ యాక్షన్ సీన్స్ తో ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాడు ప్రభాస్.. ఈ సినిమా విడుదలై కచ్చితంగా 11 సంవత్సరాలు అవుతుంది.. హిందీలో వచ్చిన డాన్ సిరీస్ ని బేస్ చేసుకొని తీసిన ఈ సినిమా మన రెబెల్ స్టార్ ప్రభాస్ ని అంతక ముందు ఎప్పుడు లేని విధంగా అల్ట్రా స్టైలిష్ గా చూపించారు డైరెక్టర్ మెహెర్ రమేష్. డాన్ సిరీస్, యాక్షన్ సినిమాలను మర్చిపోయిన మన టాలీవుడ్ ఆడియన్స్ కి ఈ మూవీతో మళ్లీ అలాంటి యాక్షన్ సినిమాలు వచ్చాయి. 

 

ఇంకా అలాంటి యాక్షన్ సినిమాలో డాన్ క్యారెక్టర్ కి కావాల్సిన పర్ఫెక్ట్ అండ్ స్టైలిష్ ఇంట్రోతో సినిమా స్టార్ అయ్యింది. ఆ ఇంట్రోకి తగ్గ మ్యూజిక్ ఇచ్చారు మణిశర్మ. ఆ హెలికాప్టర్ ఇంట్రోకి థియేటర్స్ లో అరుపులు, మెరుపులు, కేకలు.. అసలు ఇంట్రడక్షన్ సిన్ పడగానే ఏ హీరో అయినా పంచ్ డైలాగ్ చెప్తాడు.. కానీ ఈ సినిమాలో ఒక్క డైలాగ్ లేదు.. అంత బిల్లా మ్యూజిక్.. యాక్షన్ సీన్లే. 

 

ఇంకా ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ అబ్బా అనే చెప్పాలి.. బిల్లా టార్గెట్ మిస్ అవ్వకూడదు... బిల్లా ఎవరికీ టార్గెట్ అవ్వకూడదు. ఇంకా ప్రభాస్ చెప్పే ఓ డైలాగ్ ఇప్పటికి ఆహా అనిపిస్తుంది.. అదే ట్రస్ట్ నో వన్, కిల్ ఎనీ వన్, బి ఓన్లీ వన్' అనే డైలాగ్ సూపర్ అసలు. ఇంకా ఒకటి ఉంది.. అదే.. నేను వెపన్ ని వుమెన్ ని ఒకే లా వాడుతాను.. బట్ రెండిటిని వాడడంలో రిస్కు కిక్కు ఉంటాయి. 

 

ఇంకా ఈ సినిమాలో అంత సూపర్.. అనుష్క ఎంట్రీ.. హన్సిక సాంగ్ అంత సూపర్.. కానీ ఒకటే ఎత్తిపోయింది.. అదే బిల్లాలా రంగ రావడం.. రంగ ఓవర్ యాక్షన్, కృష్ణం రాజు చనిపోవడమే బాధాకరమైన విషయం.. అందుకే సినిమా స్టార్టింగ్ అంత సూపర్ గా ఉన్న లాస్ట్ లో ఎత్తిపోయింది.. కానీ ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ వస్తాయి అనుకోవడం మూర్కత్వమే అవుతుంది.. యాక్షన్ సినిమాలు అంటేనే ఇప్పుడు కష్టం మరి.  

మరింత సమాచారం తెలుసుకోండి: