పవన్ కళ్యాణ్.. సారీ సారీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఎంత గొప్ప నటుడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నిజానికి పవన్ కళ్యాణ్ నటనకు మించిన అభిమానులు ఉన్నారు.. అంతమంది అభిమానులు ఉన్నారు అని మనం కూడా ఉహించి ఉండము.. అంతమంది అభిమానులు ఉన్నారు ఆయనకు. 

 

అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభంలో సినిమాలు అన్ని హిట్ అయినప్పటికీ ఎన్నో సినిమాలు ప్లాప్ అయ్యాయి.. ఎవరికి లేనట్టుగా ఏకంగా 10 ఏళ్ళు ఆయనకు హిట్స్ ఏ లేవు.. అన్ని ప్లాప్ లే.. కానీ అభిమానులు తగ్గలేదు. 

 

అయితే ఇలా హిట్స్.. ప్లాప్స్ మధ్య పవన్ కళ్యాణ్ కొట్టుకుంటున్న సమయంలో కొన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ చేస్తాడు అని.. ప్రచారం జరిగినప్పటికీ ఆ సినిమాలు పవన్ కళ్యాణ్ తియ్యలేదు.. ఆఖరికి టైటిల్ తో పోస్టర్స్ విడుదల అయ్యాయి.. కానీ సినిమాలు మాత్రం పూర్తవ్వలేదు.. అలాంటి సినిమాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

చెప్పాలని ఉంది అనే సినిమా పవన్ కళ్యాణ్ చెయ్యాల్సింది.. కానీ పవన్ కళ్యాణ్ అది పూర్తి చెయ్యలేదు.. కానీ అది తరుణ్, రిచా నటించి ఈ నువ్వే కావాలి సినిమా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సూపర్ హిట్. ఇంకా ఆతరవాత పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి అనే సినిమా చేస్తాడు అని పోస్టర్ కూడా విడుదలయ్యింది.. కానీ అవ్వలేదు. అయితే ఈ సినిమా ట్యాగ్ లైన్ మాత్రం సత్యమే నా ఆయుధం. 

 

దేశి.. ఈ పేరుపై పవన్ కళ్యాణ్సినిమా చేస్తున్నట్టు ప్రచారం జరిగింది కానీ చెయ్యలేదు.. ఇంకా ప్రిన్స్ అఫ్ పీస్.. సంగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ జీసస్ లా నటించనున్నాడు అని ప్రచారం జరిగింది.. కానీ చెయ్యలేదు. కోబలి.. ఈ పేరుపై పవన్ కళ్యాణ్ ఓ హై బడ్జెట్ సోసియో ఫాంటసీ ఫిల్మ్ గా తియ్యనున్నాడు అని ప్రచారం జరిగింది.. కానీ తియ్యలేదు.. ఇలా కొన్ని అద్భుత సినిమాలు పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు ప్రచారం జరిగినప్పటికీ ఆ సినిమాలు తియ్యలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: