ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్ రొమాంటిక్ మూవీ 'చత్రపతి' లో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన శ్రియా శరణ్ నటించింది. వీరిద్దరి మధ్య సాగే రొమాంటిక్ సన్నివేశాలు అందర్నీ కట్టిపడేశాయంటే అతిశయోక్తి కాదు. రొమాంటిక్ సన్నివేశాల గురించి పక్కన పెడితే... చత్రపతి సినిమాలో శివాజీ( ప్రభాస్) బావూజీ( ప్రదీప్ రావత్) మధ్య చోటు చేసుకునే యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని చెప్పవచ్చు. కాట్రాజ్( సుప్రీత్) కి బానిసలుగా మారిన శ్రీలంక ప్రాంత ప్రజలలో శివాజీ(ప్రభాస్) కూడా ఉంటాడు. ఐతే ఒక పిల్లవాడిని కాపాడేందుకు శివాజీ తిరుగుబాటు దారుడుగా మారుతాడు.


ఆ సన్నివేశానికి కీరవాణి వాయించిన మ్యూజిక్... 'భీమక్ష్మపతి ,శిక్ష  స్మృతి  స్థపతి' అనే బ్యాక్ గ్రౌండ్ శ్లోకం ప్రేక్షకులను బాగా అలరించాయని చెప్పుకోవచ్చు. ఒకరోజు కాట్రాజు ఒక పిల్లాడిని చచ్చే ట్లు కొట్టి 'ఆ పిల్లోడిని కాపాడేందుకు ఎవరైనా గీత దాటితే చంపేస్తా అని అక్కడి ప్రజలకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.' అయితే ప్రభాస్ మాత్రం అతని స్నేహితులు ఎంత చెప్తున్నా 'ఇక చాలో' అని గట్టిగా అరుస్తూ ఆ గీత దాటి పిల్లోడిని ఆసుపత్రి కి పంపిస్తాడు. ఇది తెలిసిన కాట్రాజ్ ప్రభాస్ ని చంపేందుకు వస్తాడు. వీళ్లిద్దరి మధ్య దాదాపు 4 నిమిషాలు వరకు బీకరమైన కొట్లాట జరుగుతుంది. ఈ సీన్ ఛత్రపతి సినిమాలో హైలెట్ గా చెప్పుకోవచ్చు.


సినిమా లో శివాజీ తనకు దూరమైనా తన తల్లి కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ సన్నివేశాలు కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. పోర్ట్ ఏరియాలో జీవనం సాగిస్తున్న కొంత మందిని ఇబ్బంది పెడుతుంటాడు అప్పలనాయుడు( కోట శ్రీనివాసరావు). ఐతే శివాజీ తమ జోలికి రావొద్దంటూ అప్పలనాయుడిని హెచ్చరించాడానికి వస్తాడు. ఆ సీన్ లో ఓ శవాన్ని ఈడ్చుకుంటూ వచ్చిన శివాజీ... రోమాలు నిక్కబొడిచే డైలాగు అయిన 'వాడు పోతే వీడు.. వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే' అంటూ చెప్తాడు. ఈ స్మాషింగ్ డైలాగ్ ఎంతగా హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏది ఏమైనా తన సినీ చరిత్రలో మొట్టమొదటి కాదు ఫుల్ లెంత్ యాక్షన్ మూవీ అయిన చత్రపతి సినిమాలో ప్రభాస్ అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: