టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లు అర్జున్. అతని సినిమాల్లో అతని బాడీ లాంగ్వేజ్ అతని నటన అన్నీ కూడా స్టైల్ గానే ఉంటూ ఉంటాయి. అతని నటనకు ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉంటుందో తెలియదు గాని డాన్స్ కి స్టైల్ కి మాత్రం మంచి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక అల్లు అర్జున్ కెరీర్ లో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రధానంగా వచ్చిన సినిమా బన్నీ. ఈ సినిమాలో అతని తండ్రిగా నటించిన శరత్ కుమార్ ఫ్యాక్షన్ కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఆ సినిమాలో విలన్ గా ఉన్న ప్రకాష్ రాజ్... రౌడీ గా నటిస్తారు 

 

ముఖేష్ ఋషీ ని అడ్డం పెట్టుకుని శరత్ కుమార్ ని చంపిస్తాడు ప్రకాష్ రాజ్. ఆ సినిమాలో ఆ మర్డర్ ఆధారంగా చాలా సన్నివేశాలు ఉంటాయి. ఆ సినిమా యువతకు బాగా నచ్చినా యాక్షన్ సన్నివేశాలు రౌడీ సన్నివేశాలు పొలాల్లో శరత్ కుమార్ ని చంపినా విధానం రాయలసీమ ఫ్యాక్షన్ ని చూపిస్తూ ఉంటుంది. ఆ సినిమా తర్వాత బన్నీ కెరీర్ ఊపందుకుంది. ఆ సినిమా తర్వాత అతను దూకుడుగా సినిమాలు చేసాడు. శరత్ కుమార్ నటన ఆ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పవచ్చు 

 

మళ్ళీ అలాంటి సినిమాలు అల్లు అర్జున్ చేయకపోయినా సరే అతని నుంచి ఒక యాక్షన్ సినిమాను ప్రేక్షకులు ఆశించారు. జులాయి సినిమాలో కాస్త ఆ కోణం కనపడినా సరే అది మాములూ కథ గానే ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్పా సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాలో కూడా యాక్షన్ సన్నివేశాలు బాగానే ఉండే అవకాశం ఉంది. రాయలసీమ లోని చిత్తూరు జిల్లా నేపధ్యంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: