దక్షిణాది సినీ పరిశ్రమల్లో ప్రత్యేక గుర్తింపు కలిగిన శృంగార తార షకీలా. ఒకప్పుడు మాలీవుడ్ లో షకీలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. అక్కడి స్టార్ హీరోలే తమ సినిమాలు వాయిదా వేసుకునే పనిలో ఉండేవారంటే అప్పట్లో ఈ అమ్మడి రేంజ్ ఏంటో చెప్పొచ్చు.  మలయాళీ సెమీ పోర్న్ సినిమాలతో పాపులర్ అయిన ఈమె తర్వాతి కాలంలో ఇతర సినిమాల్లో కూడా నటించారు. ప్రత్యేకించి తెలుగు సినిమాల్లో వ్యాంప్, కామెడీ పాత్రల్లో నటిస్తూ వచ్చింది.  మాలీవుడ్ లోనే కాదు తమిళ, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో కూడా షకీలా నటించింది.  తెరపై ఎంత హాట్ గా, కామెడీగా ఉన్నా ఆమె జీవితంలో మాత్రం ఎన్నో విషాదాలు చోటు చేసకున్నాయని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది.  

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సినిమా వ‌స్తోందంటే స్టార్ హీరోలైన మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్ ల సినిమాలు వాయిదా వేసుకోవాల్సిందే. అలా చాలా సంద‌ర్భాల్లో జ‌రిగిందంట‌. ఇక లాభం లేద‌నుకున్న మ‌ల‌యాళ స్టార్స్  మోహ‌న్‌లాల్, మమ్ముట్టితో పాటు మ‌ల‌యాళ హీరోలు చాలా వ‌ర‌కు ష‌కీలా సినిమాలు కేర‌ళ‌లో బ్యాన్ చేయాల‌నుకున్నార‌ట‌.   కేర‌ళ స్టార్స్ సినిమాలు  4 కోట్ల‌తో చేస్తుంటే ష‌కీలా సినిమాలు కేవ‌లం 20 ల‌క్ష‌ల్లో నిర్మించేవార‌ట‌.  కానీ షకీలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టేవట. ఆ విషయంలో స్టార్ హీరోలు తనపై ఎంతో సీరియస్ గా ఉండేవారని అన్నారు. తన సినిమాలు రిలీజ్ అయ్యే సమయానికి వారి సినిమాలు వాయిదా వేసుకునేవారు. 

 

 అయితే ఆమె కెరీర్ లో ఎంతో మంది తనను ఇష్టపడ్డారని..  20 మంది ప్రేమించార‌ట‌.   త‌న‌ని ఎవ‌రూ పెళ్లి చేసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేద‌ని, ఏవేవో కార‌ణాలు చెప్పి త‌ప్పించుకున్నార‌ని, కొన్నాళ్లుగా ఓ వ్య‌క్తిని ప్రేమిస్తున్నాన‌ని, ఇద్ద‌రం క‌లిసి పెళ్లి చేసుకోవాల‌నుకున్నామ‌ని, అయితే వాళ్ల ఇంట్లో వాళ్లు అందుకు ఒప్పుకోలేద‌ని ష‌కీలా వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: