టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల విరామంత తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో కొనిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మించిన ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో హీరోగా మళ్లీ వెండితెరపై మెరిశారు.  ఈ మూవీ తమిళ్ లో హీరో విజయ్ నటించిన ‘కత్తి’ మూవీ రిమేక్.  తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసి తీశారు.  ఇందులో మెగాస్టార్ ద్విపాత్రాభినయంలోకనిపించడం.. ఒకటి రైతు సమస్యలపై పోరాడే పాత్ర అయితే మరోకటి కామెడీ, ఎంటర్ టైన్ మెంట్ పాత్రలో కనిపించారు.  ఈ మూవీతో మరోసారి చిరు తన స్టామినా ఏంటో చూపించారు.  ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ మూవీలో నటించాడు.

 

  ఈ మూవీ తర్వాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వలో ‘ఆచార్య’తీస్తున్నారు.    ముఖ్యంగా హీరోయిన్ విషయంలో.. ఎన్నోవార్తలు వస్తున్నాయి.  మొదట నయనతార అనుకున్నారట.. ఆమె డేట్స్ కుదరలేదట.. ఆ తర్వాత అనుష్క అనుకున్నారట.. ఇదే సమయంలో త్రిష ను ఫైనల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. తన పాత్రకి తగ్గ ప్రాధాన్యతను తగ్గించారని అందుకే ఆమె తప్పుకుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈ విషయాలపైన చిరంజీవి స్పందించారు. త్రిషకి చిత్ర యూనిట్ కి మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 లో చిరు సరసన నటించిన కాజల్ ని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

 

 తాజాగా ఇప్పుడు కాజల్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ఓ తమిళ సినిమా చేసేందుకు కాజల్ అంగీకరించిందట, ఈ సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చేయడం, అడ్వాన్స్ కూడా తీసుకోవడం కూడా జరిగిపోయిందట దాంతో ఆచార్య`కు కాజల్ కేటాయించిన డేట్లు కరోనా లాక్‌డౌన్ కారణంగా వృథా అయిపోవడంతో జులై నుంచి తమిళ సినిమా షూటింగ్‌లో కాజల్ పాల్గొనాలి కాబట్టి `ఆచార్య` నుంచి కాజల్ తప్పుకున్నట్టేనని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై అఫిషియల్ గా ఎలాంటి క్లారిటీ రాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: