నందమూరి నట వారసుడైన జూనియర్ ఎన్టీఆర్ కళామ్మ తల్లికి ప్రతిరూపం అంటూ వుంటారు చాలామంది. నటనలో డాన్స్ లో ఇలా ప్రతీ విషయంలో అదరగొడుతూ  ఉంటాడు ఎన్టీఆర్. ఎలాంటి పాత్ర చేసిన పాత్రకు ప్రాణం పోసేలా  నటిస్తూ ఉంటాడు. అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలను సైన్ చేస్తూ వెళ్తున్నాడు. ఇప్పటికే అరవింద సమేత తో అదరగొట్టిన ఎన్టీఆర్... ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్  అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే రోజురోజుకీ పాన్ ఇండియా హీరో గా మారిపోతున్నాడు ఎన్టీఆర్. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే అది పాన్  ఇండియా లెవెల్లో ఉంటుంది అన్న విషయం తెలిసిందే. 

 

 

 ఇక రాజమౌళి సినిమా విడుదల అయ్యింది అంటే ఇప్పటికే ఒక రేంజ్ లో ఉన్న ఎన్టీఆర్ క్రేజ్ మరెక్కడికో వెళ్ళిపోతుంది. ఇక రాజమౌళి సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన క్రేజీ కాంబినేషన్ అయినా త్రివిక్రమ్ తో సినిమా సైన్ చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తన 30వ సినిమాగా చేయబోయే ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ప్లాన్  చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో   రాబోయే  సినిమాకి ఇంకా క్లాప్  కూడా కొట్టలేదు. 

 

 

 ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన 31 వ సినిమాను కూడా సైన్  చేసినట్లు ప్రస్తుతం సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నాడట ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ 31వ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.. బాలీవుడ్ స్టార్ దర్శకుడైన సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో.. ఓ చారిత్రాత్మక చిత్రం తెరకెక్కనుందట.  ఇందులో హీరోగా ఎన్టీఆర్ నటించనున్నారు అనే టాక్ వినిపిస్తోంది. సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ  సినిమాలో ఎన్టీఆర్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ విలన్ గా నటించబోతున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం అఫీషియల్ ప్రకటన వచ్చేంతవరకూ తెలీదు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: