చేసిన సినిమాలు తక్కువే అయినా సరే నందమూరి హీరో హరికృష్ణ చేసిన సినిమాలు మాత్రం బాగా ఆకట్టుకున్నాయి ప్రేక్షకులను. ఆయన నటించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి అనేది వాస్తవం. ఆయన నటించిన సీతయ్య సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ సినిమాలో ఆయన పోలీస్ అధికారిగా నటిస్తారు. ఇక ముఖేష్ ఋషీ విలన్ గా ఆయన పక్కన. ప్రతీ సన్నివేశం కూడా ఒక స్థాయిలో ఉంటుంది ఆ సినిమాలో. యాక్షన్ హీరోగా ఆయనాకు అప్పటి వరకు గుర్తింపు లేకపోయినా ఆ సినిమా తర్వాత వచ్చింది అనేది వాస్తవం. 

 

ఆయన నటించిన ఆ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. ముఖేష్ ఋషీ కి రాజకీయ బలం ఉంటుంది. అయినా సరే ఆయన ఎక్కడా భయపడకుండా పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్ర పోషించి తన కర్తవ్యాన్ని సమర్ధవంతంగా పోషించే అధికారిగా నటిస్తారు. ఆయన నటనకు మంచి ఆవార్డులు కూడా వచ్చాయి. ఆ సినిమా తర్వాత ఆయన అలాంటి సినిమాలకు దూరంగా ఉన్నారు. క్రమంగా సినిమాలకు దూరం అయ్యారు ఆయన. హరికృష్ణ కెరీర్ లో సూపర్ హిట్ సినిమా ఏది అయినా ఉందీ అంటే అదే అని కూడా చెప్తారు. 

 

సీతయ్య ఎవరి మాట వినడూ అంటూ ఆయన చాలా బాగా మెప్పించారు. ట్రైన్ లో ఉండే ఫైట్ సీన్ లో అయితే ఆయన నటన కు జేజేలు కొట్టారు ప్రేక్షకులు. యాక్షన్ హీరోగా చాలా బాగా ఆ ఫైట్ సీన్ లో నటించారు హరికృష్ణ. ఎక్కడా కూడా ఆయన కంగారు పడకుండా నటన తో చాలా బాగా మెప్పించారు. ఆ సినిమా తర్వాత ఆయనకు కొన్ని ఆఫర్లు వచ్చినా తాను హీరోగా సరిపడను అని భావించి సినిమాలకు దూరం అయ్యారు. నటన కు ప్రాధాన్యత ఉంటే నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: