ప్రభాస్ కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా మిర్చి. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాను అభిమానులు బాగానే ఆదరించారు అనేది వాస్తవం. ఈ సినిమాలో పల్నాటి బ్యాక్ డ్రాప్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ తన కుటుంబాన్ని పగ పట్టిన మరో ఊరి ప్రత్యర్ధిని లక్ష్యంగా చేసుకుని అతను నటించే నటన చాలా బాగా ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత ప్రభాస్ బాహుబలి సినిమా చేసారు. 

 

అప్పటి వరకు ప్రభాస్ ఫ్యాక్షన్ సినిమాల్లో నటించలేదు. ఆయన నటించిన కొన్ని సన్నివేశాలు ఇప్పటికి వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక డైలాగ్ లు కూడా ప్రేక్షకులకు బాగా నచ్చాయి అనేది వాస్తవం. కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడూ వాడలేరు అని అని ఆయన చెప్పిన డైలాగ్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఆ సినిమాలో విలన్ గా నటించిన వ్యక్తి కూడా పగ అంటే ఎలా ఉంటుందో చూపించాడు. ప్రభాస్ కత్తి పట్టుకుని పొలాల్లో ప్రత్యర్ధులను నరికిన సన్నివేశాలు, అలాగే పెళ్లి సీన్ లో ప్రత్యర్ధులను చంపినా తీరు బాగా ఆకట్టుకుంది ప్రేక్షకులను. 

 

సినిమా ఎన్నో రికార్డ్ లు బద్దలు కొట్టింది. ప్రభాస్ ని కమర్షియల్ హీరోగా మార్చింది ఆ సినిమా అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఆయన నటన చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక అది పక్కన పెడితే ఇప్పుడు ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: