IHG

అందాల రాక్షసి సినిమా తో కుర్రకారు గుండెల్ని దోచిన అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. ఆ సినిమాలో ఆమె నటన ఎంతగానో ఆకర్షించింది. చేసింది కొన్ని సినిమాలే అయినా చాల గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతానికి కొద్దొ గొప్పో సినిమాలలో  కనిపిస్తున్నా ఈ అమ్మడి క్రేజ్ మాత్రం ఏమి తగ్గలేదు. తాజాగా ఈ అమ్మడు నాగార్జున తో నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా గురించి  నమ్మలేని నిజాలను బయట పెట్టింది. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా చేయడం తనకు ఇష్టం లేకున్నా చేశానని చెప్పుకొచ్చింది. ఆ సినిమా చేయటానికి అగ్రిమెంట్ మీద సైన్ పెట్టేముందు చాల వెనుకాడనని చెప్పింది.

 

IHG

ఎందుకంటె తన కెరీర్ అప్పుడే స్టార్ట్ అవుతున్న ఈ టైం లో సీనియర్ నటులతో కలసి నటిస్తే కెరీర్ చంకనాకిపోద్ది అని తన ఫ్రెండ్స్ సలహా ఇవ్వడంతో బెంబేలెత్తి పోయిండట. వాళ్ళు చెప్పిన మాటలకూ కంగారు పడిన నేను నాగ్ సర్ తో ఈ విషయంగురించి చర్చించానని చెప్పింది, అయితే నాగార్జున మాత్రం నవ్వేసి వూరుకున్నారని తరువాత అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పారని చెప్పింది. అయన భరోసా ఇచ్చిన తరువాతే తానూ ఆ సినిమాను హ్యాపీగా చేసినట్లు ఈ ముద్దుగుమ్మ తెలియజేసింది.  సోగ్గాడే చిన్ని నాయన చేయడం నా కెరీర్ లో తీసుకున్న మంచి నిర్ణయాలలో ఒకటి. అయితే ఇప్పటికీ తనకు ఏమైనా సందేహాలు వస్తే నాగ్ సర్ తో షేర్ చేసుకుంటూ ఉంటానని తెలిపింది. ఆయన నాకు ఒక మంచి మెంటర్ లాంటి వారు అని నాగ్ పై తన అభిమానాన్ని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: