ఒక‌ప్పుడు యాక్ష‌న్ మూవీస్ అంటే ఎక్కువ‌గా హాలీవుడ్ మూవీస్‌నే చూసేవాళ్ళం.  ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా ఎక్కువ‌గా యాక్ష‌న్ మూవీస్ ఉంటున్నాయి. చాలా మంది మాస్ ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా యాక్ష‌న్ మూవీస్‌కే ఫిదా అవుతున్నారు.  అలా యాక్ష‌న్ కంటెంట్‌తో తెర‌కెక్కిన చిత్రాలేమిటో అవి బాక్సాఫీస్ ముందు ఎలాంటి విజ‌యాలు సాధించాయి అలాగే  కంటెంట్, టాక్‌తో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బంపర్ కలెక్షన్స్ రాబడతాయి. కొన్నిసార్లు హీరోకు ఉన్న క్రేజ్‌ను బట్టి అయితే మ‌రికొన్నిసార్లు 2019లో కొన్ని సినిమాలు హీరో ఫేమ్ వల్ల భారీ వసూళ్లు రాబట్టాయి.. మరికొన్ని చిత్రాలైతే కంటెంట్ వల్ల కలెక్షన్స్ అందుకున్నాయి. మరి అలా ప్రపంచవ్యాప్తంగా హయ్యస్ట్ గ్రాసర్స్‌గా నిలిచిన మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం…

 

సాహో..

‘బాహుబలి’ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రం ‘సాహో’. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు. కథ, కథనంలో లోపాలు ఉన్నప్పటికీ.. యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉండటం.. అంతేకాకుండా ప్రభాస్ వరల్డ్‌వైడ్ క్రేజ్ సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. తెలుగులో ప్లాప్ అయినా.. హిందీలో మాత్రం ఈ  చిత్రం భారీ వసూళ్ల‌ను రాబట్టింది. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఇలా అన్ని భాష‌ల్లో విడుదలైంది.

 

సైరా నరసింహా రెడ్డి…

తొలి స్వాతంత్య్ర‌ సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘సైరా నరసింహరెడ్డి’.  మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషించగా.. అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, జ‌గ‌ప‌తిబాబు వంటి ప్రముఖులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చాత్రాన్ని.. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించాడు. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసింది. 

 

మహర్షి…

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కింది ‘మహర్షి’. మంచి మెసేజ్ ఓరియెంటెడ్‌గా రూపొందిన ఈ చిత్రం మహేష్ కెరీర్‌లో బెస్ట్ మూవీ‌గా నిలిచింది. ఈ చిత్రంలో యాక్ష‌న్ సీన్స్ అద్భుత‌మ‌ని చెప్పాలి. 

 

వినయ విధేయ రామ:

‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన త‌ర్వాత‌ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి వచ్చిన చిత్రం ‘వినయ విధేయ రామ’. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమా తెరకెక్కించారు. మాస్ ఎలెమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. రిలీజైన తర్వాత అవి కాస్తా నీరు కారిపోయాయి. కానీ ఈ సినిమా మాత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 97.9 కోట్ల కలెక్షన్స్ రాబట్టి 2019 హయ్యస్ట్ గ్రాసర్స్‌‌లో ఒకటిగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: