తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చిన ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఏది అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులందరికీ గుర్తొచ్చే ఒకే ఒక  సినిమా  సింహ. బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ ఫుల్ యాక్షన్ అనే పేరుకు సరికొత్త హంగులు అద్దింది  అనే చెప్పాలి. మామూలుగానే బాలకృష్ణ పవర్ఫుల్ హీరోయిజానికి.. అదిరిపోయే యాప్షన్ కి కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే.. ఇక బోయపాటి శ్రీను గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే... యాక్షన్ సన్నివేశాలను  బోయపాటి తెరకెక్కించినంత  అద్భుతంగా ఎవరు తెరకెక్కించ లేరు అని చెప్పవచ్చు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. 

 

 

 ఈ సినిమాలో బాలకృష్ణ యాక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలో ప్రతిసారి బాలకృష్ణ విలన్లను గాల్లోకి ఎగరేసి మరి కొడుతూ ఉంటాడు. ఇక బాలకృష్ణ చేసిన యాక్షన్ కి మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించి పోయారు అని చెప్పాలి. ఇలాంటి అద్భుతమైన యాక్షన్ కి బాలకృష్ణ తనదైన స్టైల్ లో పంచు డైలాగులు చెప్పడంతో.. ఈ మాస్ ఎలిమెంట్స్ యొక్క రేంజ్  ఎంతగానో పెరిగిపోయింది. సింహ సినిమా చూసిన  మాస్ ప్రేక్షకులు అందరూ ఒక రేంజ్ లో ఎంజాయ్ చేశారు అని చెప్పవచ్చు. ఇక సింహ సినిమా లో డైలాగులు కూడా అద్భుతం మహా అద్భుతం అనే చెప్పాలి. 

 

 

 ప్రతి డైలాగు కూడా సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఈలలు గోలలో హోరెత్తేలా చేస్తుంది . బాలకృష్ణ ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించారు దర్శకుడు బోయపాటి. అద్భుతమైన మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో అదరగొట్టాడు . అందుకే ఎన్ని యాక్షన్ ఎలిమెంట్ ఉన్న సినిమాలు వచ్చినప్పటికీ సింహ సినిమా మొత్తం తెలుగు ప్రేక్షకులందరికీ ఎవర్గ్రీన్ యాక్షన్ హిట్ సినిమాగా నిలిచింది. అందుకే ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన ఆ  అద్భుతమైన యాక్షన్  సన్నివేశాలు  ఇప్పటికీ ప్రేక్షకులను అబ్బుర పరుస్తూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: