2018వ సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఫ్యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన అరవింద సమేత వీర్ రాఘవ చిత్రం గురించి చెప్పాలంటే ఎన్నో ప్రత్యేకమైన విశేషాలు ఉన్నాయి. నల్లగుడి, కొమ్మద్ది అనే రెండు గ్రామాల మధ్య జరిగే ఫ్యాక్షన్ కథ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ యాక్షన్ హీరోగా బాగా మెప్పించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం కూడా చాలా క్రియేటివ్ గా ఉండడంతో అభిమానులకు అరవింద సమేత వీర రాఘవ బాగా నచ్చేసింది. తాను రాసిన డైలాగులు, తమన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్లు కూడా చాలా బాగున్నాయి. ఈ చిత్రంలోని ఒక సన్నివేశంలో తారక్ కత్తికి అంటిన రక్తాన్ని తొడకు తుడుచుకుంటాడు. ఈ మూవీలో ఆ సన్నివేశం హైలెట్ అని చెప్పుకోవచ్చు.


ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వీర రాఘవ రెడ్డి పాత్రలో సిక్స్ ప్యాక్ తో చాలా ఫ్రెష్ గా కనిపించాడు. ప్రతినాయకుడిగా అత్యంత క్రూరమైన బసి రెడ్డి పాత్రలో జగపతిబాబు నటించి అందరి మన్ననలు పొందాడు. రంగస్థలం సినిమాల్లో కంటే అరవింద సమేత సినిమాలోనే జగపతి బాబు బాగా నటించాడని అనే టాక్ కూడా వినిపించింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా గత చిత్రాల్లో కంటే అరవింద సమేత చిత్రంలో చాలా అద్భుతంగా నటించాడు. రాయలసీమ యాసలో తాను చెప్పిన డైలాగులు, మాడ్యులేషన్ స్టైల్ సూపర్ గా ఉండడంతో పాటు భావోద్వేగ సన్నివేశాల్లో తారక్ పలికించిన ఎక్స్ప్రెషన్స్ కి ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.


అరవింద పాత్రలో పూజా హెగ్డే కూడా చాలా చక్కగా నటించి కుర్రకారు మతులు పోగొట్టింది. ఎమోషనల్ సన్నివేశాల్లో పూజా పలికించిన హావభావాలు అందర్నీ వెండితెరకి కట్టిపడేస్తాయి. ఏదిఏమైనా మొదటిసారిగా ఫ్యాక్షన్ డ్రామా సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి తెరకెక్కించి తెలుగు ప్రేక్షకులను బాగా అలరించారు త్రివిక్రమ్ శ్రీనివాస్. 

మరింత సమాచారం తెలుసుకోండి: