టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక ప్రత్యేకమైన క్రేజ్. ఎందుకంటే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న దాదాపు చాలా మంది హీరోలు మెగా ఫ్యామిలీకి చెందిన వారు. మెగాస్టార్ చిరంజీవి వారసులు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి ఎంతగానో ఆకట్టుకుంటున్నారు . అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ప్రస్తుతం మెగా ఫ్యామిలీకి ఇంకా ఒక  చాన్స్ మాత్రం దక్కించుకోలేకపోయారు . మెగా ఫ్యామిలీ లకు చెందిన హీరోలు అందరూ ఆ చాన్స్ దక్కించుకున్నారు. ఇంతకీ ఏంటి ఆ చాన్స్ మెగా ఫ్యామిలీకి దక్కకపోవడం ఏమిటి అంటారా. 

 

 

 ఆ చాన్స్ ఏమిటి అంటే... నిజజీవిత పాత్రలనే  సినిమాలో పోషించడం.. ప్రస్తుతం దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య వెంకీమామ సినిమాతో రీల్ లైఫ్ లో కూడా మామా అల్లుళ్లు గా నటించారు... ఇక అక్కినేని ఫ్యామిలీ కూడా మనం లో  మొత్తం తమ రియల్ పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. ఇక నాగచైతన్య సమంత రియల్ లైఫ్ పాత్రలని రీల్ లైఫ్లో కూడా మజిలీ సినిమాలో నటించి ఆకర్షించారు.ఇక అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని నాగార్జున కలిసి కలెక్టర్ గారి అబ్బాయి అగ్నిపుత్రుడు లాంటి సినిమాల్లో కొడుకులు గా నటించారు. ఇక ఎన్టీఆర్ బాలకృష్ణ హరికృష్ణ విషయానికొస్తే తాతమ్మకళ  సినిమాలో తండ్రీ కొడుకులుగా నిజజీవిత పాత్రల్లో నటించారు. 

 

 

 చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని కుటుంబాలకు చెందిన వారు నిజ జీవితంలో పాత్రను సినిమాల్లో కూడా  నటించారు. కానీ ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీకి  మాత్రం ఆ అవకాశం రాలేదు. మెగా ఫ్యామిలీకి సంబంధించి ఇప్పటికే నిహారిక మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఇలా కొంతమంది కలిసి నటించినప్పటికీ నిజ జీవిత పాత్రలో మాత్రం నటించలేక  పోయారు. దీంతో తెలుగు పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఒక్క కోరిక మిగిలిపోయింది అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ నాగబాబులు కూడా అన్న చిరంజీవితో నటించినప్పటికీ అన్నదమ్ముల పాత్రలు కాకుండా వేరే పాత్రలో నటించారు. దీంతో వీరందరు నిజజీవిత పాత్రల్లో నే సినిమాల్లో కూడా నటిస్తే ఆ కిక్కే వేరు ఉంటుంది. దీని కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: