IHG

రిషీ కపూర్ తన చివరి రోజు రాత్రి ఓ అభిమానితో తీసిన వీడియో ప్రస్తుతం వివాదంగా మారింది. ఫెడరేషన్ ఆఫ్  వెటర్న్ఇండియా సినీ ఎంప్లాయిస్ తమ  అభ్యంతరాలను వ్యక్తం చేసింది. రిషీ కపూర్ చివరి రోజులకు సంబంధించిన  హాస్పిటల్ సంఘటనను ఎలా వీడియో తీస్తారు... వైద్య నియమాలకు ఇది వ్యతిరేకం కాదా అంటూ రిలైన్స్...హాస్పిటల్ వర్గాలను ప్రశ్నించడం మీడియాలో చర్చనీయాంశమైంది... ఆ వీడియో గురించి అసలు విషయం ఏమిటంటే... ఏప్రిల్ 30వ తారీఖున రిషి కపూర్ చనిపోయిన తర్వాత ఓ వీడియో రిషీ కపూర్ బెడ్ పై చివరి క్షణాలు అంటూ ఓ వీడియో ఇంటర్నెట్లో తెగ పాపులర్ అయింది.

 

IHG

ధీరజ్  కుమార్ సాను అనే అభిమాని దివానా చిత్రంలోని   తేరే దర్ద్ సే దిల్ ఆదాబ్ రహ... అనే పాటను రిషీ కపూర్ ముందు పాడి వినిపించగా... రిషీ కపూర్ ఆ పాట విని ఫిదా అయిపోయి అతను గొప్పగా రాణించాలి అంటూ దీవెనలు కూడా అందించాడు. అయితే రిషి కపూర్ మరియు ధీరజ్ కుమార్ వీడియో ఫై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్శకుడు అశోక్ పండిట్ హెచ్ఎం హాస్పిటల్ వర్గాలకు లేఖ రాశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన లెజెండ్ రిషి కపూర్ అయితే ఆయన వీడియో ని అతని కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఎలా రిలీజ్ చేస్తారని... అదేవిధంగా ఆయన గౌరవానికి, ప్రతిష్ట కి  భంగం కలిగించేలా వ్యవహరించారు...

 

 

 

గతంలో కూడా వినోద్ ఖన్నా కి సంబంధించిన హాస్పిటల్ వీడియోలు ఈ నేపథ్యంలోనే లీకైన విషయం గుర్తు చేస్తూ ఆయన ఇలాంటి తప్పులు పునరావృతం కావడం వైద్య నియమాలకు వ్యతిరేకమని ఆ లేఖలో అశోక్ పండిట్ ఆవేదన వ్యక్తం  చేశాడు. అసలు విషయం గురించి ధీరజ్ కుమార్  వివరణ ఇచ్చాడు. ఆ  వీడియో ఫిబ్రవరి నెల రిషీ కపూర్ హాస్పిటల్లో చేరినప్పటిది. ఈ సమయంలో తాను రిషి కపూర్ ని కలిసినప్పుడు... తాను అభిమానినని చెప్పి....  నా..గురించి చెబితే పాట పాడమని అడిగారు... దాంతో నేను పాట పాడాను. అందుకు సంతోషించిన ఆయన కష్టపడి పైకి రావాలని దీవెనలు అందించారు. నేను గాయకుడు కుమార్ సాను  అభిమానిని. అందుకే నా పేరులో ధీరజ్ కుమార్ పక్కన  సాను చేర్చుకున్నానని చెప్పాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: