బెల్లంకొండ శ్రీనివాస్.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ సినీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయ‌న..  తొలి సినిమా అల్లు శీను దగ్గర నుంచి ఎంపిక చేసుకుంటోన్న కథలన్నీ వైవిధ్యమైనవే. ఈ క్ర‌మంలోనే ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ సినీ కెరీర్‌లో `జయ జానకి నాయక` సినిమా ఓ ప్ర‌త్యేక స్థానం అని చెప్పుకోవాలి. శ్రీనివాస్ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘జయ జానకి నాయక’ చిత్రం వెండితెరపై మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. పంతం, పరువు ఈ రెండిటి మధ్య నలిగిపోయే ఓ అమ్మాయి, తనను కాపాడుకోవడానికి ప్రయత్నించే ఓ యువకుడు మధ్య నడిచే కథే ఈ సినిమా. 

 

ప్రేమ కథ చుట్టూ బోయపాటి స్టైల్ యాక్షన్ ఎలిమెంట్స్‌ను జోడించి సినిమాగా తెరకెక్కించారు. అందుకు త‌గ్గ‌ట్టు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా పాత్ర‌లో లీన‌మై యాక్ష‌న్ హీరోగా ఇర‌గ‌దీశాడ‌నే చెప్పాలి.  పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి షో నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమాలో లవ్ స్టోరీ కంటే యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. ఇక‌ సినిమాకు హైలైట్‌గా నిలిచింది కూడా బోయపాటి శైలి యాక్షన్ సన్నివేశాలే. 

 

ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. అంతేకాకుండా.. శరత్‌కుమార్, నందు, జగపతిబాబు, ప్రగ్య జైస్వాల్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో డాన్స్, ఫైట్స్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి. వాస్త‌వానికి శ్రీనివాస్‌కు ఇది మూడో సినిమా. గతంలో వచ్చిన రెండు సినిమాలూ శ్రీ‌నివాస్‌కు స‌క్సెస్ ఇవ్వ‌లేక‌పోయాయి. అయితే ఈ సినిమా మొదలయ్యే నాటికి అతని బలాలు, బలహీనతలు బోయపాటి బాగా గమనించి.. బెల్లంకొండ‌కు తగినట్టుగానే సన్నివేశాలు రాసుకుని.. సూప‌ర్ హిట్ కొట్టాడు.

 
   

మరింత సమాచారం తెలుసుకోండి: