సూపర్ స్టార్ క్రిష్ణ. డేరింగ్ అండ్ డేషింగ్ క్రిష్ణ. ఇలా క్రిష్ణ పేరుకు ముందు ఎన్నో బిరుదులు ఉంటాయి. ఆయన అసలు పేరు ఘట్టమనేని శివరామక్రిష్ణమూర్తి. ఆయన అచ్చమైన బుర్రిపాలెం బుల్లోడు. క్రిష్ణ  వెండి తెర మీద తొలిసారి కనిపించినపుడు పెదవి విరిచిన వారే తరువాత షాక్ తిన్నారు. క్రిష్ణ ముందు సీనియర్ నటులూ కూడా కొన్ని సార్లు వెనకబడ్డారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే క్రిష్ణ కేవలం 27 ఏళ్ళ వయసులోనే పద్మాలయ సంస్థ పేరు మీద భారీ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. ఆయన తెలుగు  ఇండస్ట్రీకి  సినిమా స్కోప్ పరిచయం చేశారు. సెవెంటీ ఎంఎం కూడా క్రిష్ణ అందించినదే, సినిమా రంగం సాంకేతికంగా ఈ రోజు ఇలా ఉందంటే అందులో క్రిష్ణ షేర్ చాలా ఎక్కువ.

 

ఇక క్రిష్ణ తాను హీరోగా హాలీవుడ్ స్టైల్లో మోసగాళ్ళకు మోసగాడు 1970ల్లోనే  నిర్మించి సూపర్ స్టార్ అంటే ఆయనే అనిపించారు. ఈ మూవీ గురించి హాలీవుడ్ కూడా చెప్పుకునేలా చేశారు. అలాగే ఆయన అక్కినేని నటించిన దేవదాస్ ని మళ్ళీ తీసి కొత్త హిస్టరీ స్రుష్టించారు. అంతేకాదు. మళ్టీ స్టారర్ మూవీ అంటే ఇది అని చెప్పేలా దేవుడు చేసిన మనుషులు మూవీ తీసి సూపర్ హిట్ కొట్టారు. అందులో ఎన్టీయార్ ని హీరోగా పెట్టి తాను సరి సమానమైన క్యారక్టర్ వేశారు. 

 

ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే అల్లూరి సీతారామరాజు మూవీని క్రిష్ణ తీయడం గొప్ప సాహసం. ఎన్టీయార్ లాంటివారు ఇది డ్రై సబ్జెక్ట్.. పెద్దగా  ఆడదు అని తేల్చేశాక క్రిష్ణ టేకప్ చేయడమే కాదు. సూపర్ హిట్ చేసి చూపించారు. నిజంగా మూడు పదుల వయసు  నిండకముందే టాలీవుడ్లో క్రిష్ణ చేసిన విన్యాసాలు, ఆయన సాహసాలు ఒక చరిత్ర అని చెప్పాలి.

 

ఆయన ముందు కానీ తరువాత తరం వారు కానీ కనీసం టచ్ చేయలేని ఎన్నో ప్రయోగాలు క్రిష్ణ చేశారు. ఇపుడు హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడానికే అలసిపోతున్నారు. 24 క్రాఫ్టుల మీద కూడా పెద్దగా అవగాహన లేని వారు కూడా  ఉన్నారు. ఓ విధంగా సుఖపడే హీరోలు ఎక్కువగా ఇపుడు ఉన్నారు అనుకోవాలి.  ఈ టైమ్ లో క్రిష్ణ లాంటి నటుడు మళ్ళీ పుడతారా అన్నది ఒక పెద్ద ప్రశ్నగానే ఉంది. నిజంగా స్టార్లు బిరుదు తగిలించుకున్న వారెవరూ ఆయనకు సరిసాటి కారని కూడా చెప్పాలేమో.

 

ఏది ఏమైనా కొండలను ఢీ కొట్టి బంగారం తీసే సాహసి క్రిష్ణ అని చెప్పాలి. క్రిష్ణ టాలీవుడ్ కి చేసిన సేవలు ఒక పెద్ద పుస్తకమే అవుతుంది. ఆయన లివింగ్ లెజెండ్ అని చెప్పాలి. ఆయనను నవతరం స్పూర్తిగా తీసుకుంటే టాలీవుడ్లో హిట్ల శాతం పెరుగుతుంది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: