దేశంలో  క‌రోనా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో  బాలీవుడ్  నటుడు  సల్మాన్ ఖాన్  నటిస్తోన్న  రాధే షూటింగ్ వాయిదా ప‌డింది. దీంతో  స‌ల్మాన్ కుటుంబంతో  క‌లిసి  తాను ఎక్కువగా ఇష్ట‌ప‌డే ఫామ్‌హౌజ్‌కు మ‌కాం మార్చాడు. ఇంటికి పరిమితమైన దేశ ప్రజలు రకరకాల పనులు చేస్తూ తమ సమయాన్ని గడుపుతున్నారు. ఇక సెలబ్రిటీలు అయితే తమలో దాగి ఉన్న కొత్త కళల్ని బయటకు తీస్తున్నారు. కొందరు వర్క్ అవుట్లు చేస్తుంటే.. మరికొందరు మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకొందరు హీరోయిన్లు ఇంటి పనులు చేసుకుంటున్నారు.  ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన మేనళ్లుడు తో ఫామ్ హౌజ్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.  గుర్రాలకు మేత వేస్తూ తాను కూడా గడ్డి తిన్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.  ఆ  ఫామ్ హౌజ్‌లో అన్ని సౌక‌ర్యాలు ఉన్న‌ట్లు సమాచారం. 

 

సాధారణంగా   స‌ల్మాన్  ఆ  ఫామ్‌హౌజ్‌లో త‌న పుట్టిన రోజులు వేడుక‌లు జ‌రుపుకుంటాడు.  క్షణం తీరిక లేకుండా గడిపే బాలీవుడ్ సెలబ్రిటీలకు లాక్ డౌన్ కారణంగా కావాల్సినంత ఫ్రీటైమ్ దొరికింది. ఇంటివద్ద, లేదా ఫాంహౌస్ లలో ఉంటూ వారు తమకు నచ్చిన పనులు చేస్తూ కాలం గడిపేస్తున్నారు. తాజాగా శ్రీలంక బ్యూటీ మోడల్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫాంహౌస్ లో కొందరు స్నేహితులతో కలిసి ఉంటోంది.  తాజాగా తన లాక్ డౌన్ అనుభవాలను జాక్వెలిన్ తన అభిమానులతో పంచుకుంది.

 

ఫాంహౌస్ లో ప్రతిరోజు రెండు సార్లు హార్స్ రైడింగ్ చేస్తున్నానని జాక్వెలిన్ తెలిపింది. గుర్రాలకు స్నానం చేయిస్తున్నానని, గుర్రపుశాలను శుభ్రం చేస్తున్నానని చెప్పింది.  ఈ పనుల వల్ల తాను ఎంతో నేర్చుకోవడమే కాదు ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే అవకాశం దొరికిందని అంటుంది.  అంతే కాదు ఇక్కడ వర్కవుట్ చేయడానికి సమయం బాగా దొరికిందని ఫాంహౌస్ లో పండుతున్న కూరగాయలతో సలాడ్స్ చేస్తున్నానని, ఫాంహౌస్ చాలా బాగుందని... ఇక్కడి నేచర్ అద్భుతంగా ఉందని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: