కరోనా వైరస్ వల్ల దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంతో మంది దినసరి కూలీలు, చిరుద్యోగులు, చిర వ్యాపారస్తులు నానా అవస్థలు పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. పేద ప్రజలకు సహాయం చేయడానికి ఎంతో మంది సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలు పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్ విరాళాలు అందిస్తున్నారు.  తాజాగా నిరుపేద కళాకారులను ఆదుకునేందుకు సినీ సెలబ్రెటీలు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో లారెన్స్ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తను పైకి వచ్చిన నృత్య రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని కష్టకాలంలో ఆదుకుంటూ రాఘవ లారెన్స్ తన పెద్ద మనసు మరోసారి చాటుకున్నారు.

 

పని లేక ఇబ్బందులు పడుతున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయం అందించారు హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్. ఒక్కొక్కరికీ 25,000 రూపాయల చొప్పున హైదరాబాద్ లో 10 మందికి, చెన్నై లో 13 మందికి మొత్తం 23 మందికి 5 లక్షల 75 వేల రూపాయలు లారెన్స్ డైరెక్ట్ గా వారి అకౌంట్లో వేశారు. అంతే కాదు తన ట్రస్ట్ ద్వారా ఎంతో మంది నిరుపేదలను ఆదుకుంటున్నారు.. వారికి నిత్యావసరాలు పంచుతున్నారు.. అన్నదానం చేస్తున్నారు.  తాజాగా తన వంతు సాయంగా వంద బస్తాల బియ్యాన్ని లారెన్స్‌కు పంపించారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ విషయాన్ని లారెన్స్ స్వయంగా వెల్లడిస్తూ రజనీకాంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

 

కమలహాసన్, అజిత్, విజయ్, సూర్య సహా ఇతర నటులు, రాజకీయ నేతలు కూడా ముందుకొచ్చి సాయం చేయాలని ఈ సందర్భంగా లారెన్స్ కోరారు.  ఇటీవల చంద్రముఖి 2 మూవీకి తీసుకున్న అడ్వాన్స్ విరాళం కింద ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సినీమా పంపిణీదారులకు రూ. 15 లక్షలు, నడిగర్ సంఘానికి రూ. 25 లక్షలు, పారిశుద్ధ్య కార్మికులకు రూ. 25 లక్షలు చొప్పున దాదాపు రూ. 4 కోట్లు సహాయనిధికి అందించినట్టు లారెన్స్  చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: