ప్రస్తుత౦ మన తెలుగులో ప్రయోగాలు చేయడానికి చాలా మంది అగ్ర దర్శకులు హీరోలు నిర్మాతలు భయపడుతున్న సంగతి తెలిసిందే. చిన్న చిన్న హీరోలు చిన్న చిన్న దర్శకులు కూడా ఇప్పుడు సినిమాలు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. చిన్న సినిమాల నిర్మాతలు అయినా పెద్ద సినిమాల నిర్మాతలు అయినా సరే తమకు కథ చాలా నచ్చి ఏ మాత్రం ప్రయోగం లేకుండా ఉంటేనే దాదాపుగా చేసే పరిస్థితి టాలీవుడ్ లో ఉంది అనేది వాస్తవం. ఇది పక్కన పెడితే టాలీవుడ్ లో ఇప్పుడు ఒక హీరో ప్రయోగాలు చేయడానికి సిద్దమైనట్టు సమాచారం 

 

ఇప్పటికే రంగస్థలం సినిమాతో ప్రయోగానికి సిద్దమైన రామ్ చరణ్ ఇప్పుడు తర్వాతి సినిమాలో కూడా అలాగే ప్రయోగం చెయ్యాలి అని భావించినట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. మొన్న చెవిటి వాడిగా నటించిన రామ్ చరణ్ ఇప్పుడు ఒక కన్ను కనపడని వాడిగా నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు దర్శకుడిగా అనీల్ రావిపూడి వ్యవహరించే సూచనలు ఉన్నాయి. ఈ సినిమాకు నిర్మాతగా మహేష్ బాబు వ్యవహరిస్తారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. 

 

ప్రస్తుతం మహేష్ బాబు పరుశురం తో సినిమా చెయ్యాలి అనుకున్నారు. దాని కంటే ముందు మళ్ళీ అనీల్ రావిపూడి తో సినిమా చెయ్యాలి అనుకున్నా తనకు నచ్చిన విధంగా కథ లేకపోవడంతో వెనక్కు తగ్గాడు. ఇప్పుడు మళ్ళీ కథను రామ్ చరణ్ కి అనీల్ వినిపించడం తో సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అయింది. ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది.  జనవరి 8 న విడుదల చేస్తారు

మరింత సమాచారం తెలుసుకోండి: