టాలీవుడ్ లో ఇప్పుడు హీరోలు ప్రయోగాలు చేయడానికి సిద్దంగా ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అగ్ర హీరోలు అందరూ కూడా ప్రయోగాలకు సిద్దంగా ఉన్నారు అనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతుంది. టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాలకు పెట్టుబడి పెట్టాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది దర్శక నిర్మాతలకు . అందుకే ఇప్పుడు హీరోలు కూడా చాలా జాగ్రత్తగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి వచ్చింది అయితే అల్లు అర్జున్ మాత్రం తాను రాబోయే మూడేళ్ళు కూడా ప్రయోగాలు చేస్తాను అని చెప్తున్నాడు. 

 

ప్రయోగాలు చేయడానికి తాను సిద్దంగా ఉన్నాను అని కొందరు దర్శక నిర్మాతలకు ఇప్పటికే సంకేతాలు కూడా అతను పంపించాడు అని టాలీవుడ్ జన౦ అంటున్నారు. పుష్ప సినిమాలో అతని పాత్ర చాలా కష్టం గా ఉంటుంది అని అత్యంత భయంకరం గా ఉంటుంది అని అంటున్నారు. రామ్ చరణ్ రంగస్థలం సినిమా కోసం చాలా కష్టాలు పడ్డాడు అని ఇప్పుడు అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా కోసం అదే విధంగా కష్టపడుతున్నాడు అని అంటున్నారు. ఇందులో అతను కుంటి వాడిగా కూడా నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం అతను వేరే సినిమాలను కూడా దాదాపుగా పక్కన పెట్టాడు అని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. 

 

ప్రస్తుత హీరోల్లో చాలా మంది ప్రయోగాలు చేయడానికి ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది. కాని బన్నీ మాత్రం తాను ఏ ప్రయోగం అయినా చేయడానికి సిద్దంగా ఉన్నాను అని చెప్తున్నాడు అందుకే అతని సినిమాల్లో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది దర్శక నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. రామ్ చరణ్ కూడా సినిమా నిర్మిస్తా అని అతన్ని అడిగాడు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: