టాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలూ చాలా తక్కువగా ఉంటాయి అనే సంగతి తెలిసిందే. హింది తో పోలిస్తే మన తెలుగులో ప్రేమ వ్యవహారాల అలజడి చాలా తక్కువ అనేది వాస్తవం. ప్రస్తుతం మన తెలుగులో యువ హీరోలు కూడా వీటికి చాలా వరకు దూరంగానే ఉన్నారని అంటున్నారు. యువ హీరోయిన్ లు ఎవరూ కూడా ప్రేమ వ్యవహారాల మీద అంతగా దృష్టి పెట్టడం లేదని సీనియర్ హీరోయిన్ లు కూడా ఇప్పుడు వాటికి దూరంగా ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం తెలుగు హీరోల అందరి దృష్టి సినిమాల మీదనే ఉంది అని అంటున్నారు. 

 

అయితే ఇప్పుడు ఒక ప్రేమ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది అని సమాచారం. టాలీవుడ్ లో ఈ ప్రేమ వ్యవహారం గురించి గొడవలు కూడా జరిగాయి. ఒక యువ హీరో హీరోయిన్ వెంట పడటం సంచలనంగా మారింది అని ఆమె కొందరికి ఫిర్యాదు చేసింది అని సమాచారం. దీనిపై అతనికి వార్నింగ్ కూడా కొందరు ఇచ్చారని అయినా సరే అతను మాత్రం ఆపడం లేదని అంటున్నారు దీని గురించి ఇప్పుడు టాలీవుడ్ లో కొందరు సీరియస్ గా ఉన్నారని ఆ హీరోయిన్ ఎవరు అనేది స్పష్టంగా తెలియకపోయినా ఆమెను ఒక యాంకర్ ద్వారా యువ హీరో కలిసాడు అని అంటున్నారు. 

 

ప్రస్తుతం దీని గురించి ఒక అగ్ర కుటుంబానికి చెందిన సీనియర్ హీరో జోక్యం చేసుకుని చర్చలు కూడా జరుపుతున్నారని త్వరలోనే ఈ వివాదానికి ముగింపు పలికే ఆలోచనలో ఆయన ఉన్నారని అంటున్నారు. రాజకీయ నాయకులకు కూడా ఈ ప్రేమ వ్యవహారం తగిలింది అని సమాచారం. ఒక మాజీ మంత్రి కుమారుడు ఆమెను ప్రేమించాడు అని టాక్. అయినా సరే ఆ యువ హీరో ఆగడం లేదని త్వరలో మరో వార్నింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: