జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించనున్నాడు. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ లుక్ ని రివీల్ చేసిన తర్వాత కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి కలిగింది. మే ౨౦వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఎన్టీఆర్ లుక్ ని విడుదల చేస్తారని అనుకుంటున్నారు.

 

అయితే ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఇంకా స్క్రిప్టు దశలో ఉన్న సినిమాకి అయినను పోయిరావలే హస్తినకు అనే టైటిల్ ని అనుకుంటున్నట్టు ప్రచారం జరుగింది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్, పాన్ ఇండియా స్టార్ అవడం ఖాయమని అంటున్నారు. రాజమౌళి మీద ఉన్న నమ్మకంతో ఆర్.ఆర్.ఆర్ మీద బాలీవుడ్ లోనూ అంచనాలు పెట్టుకుంటున్నారు.

 


అయితే ఇదిలా ఉంటే బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఎన్టీఆర్ తో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నాడని అంటున్నారు. బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి సినిమాలని తెరకెక్కించిన సంజయ్ లీలా భన్సాలీ, ప్రస్తుతమ్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో గంగూభాయ్ కతైవాడి’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ తీస్తున్నాడు. ఈ సినిమా అనంతరం తాను తెరకెక్కించే పీరియాడిక్ డ్రామాలో ఎన్టీఆర్ ని తీసుకోనున్నాడని ప్రచారం జరుగుతోంది.

 

ఆర్.ఆర్.ఆర్ ద్వారా వచ్చే పాన్ ఇండియా ఇమేజ్ ని వాడుకుంటూ, తన సినిమాలో హీరోగా తీసుకోనున్నాడని సమాచారం వస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఎన్టీఆర్ తర్వాతి చిత్రం గురించి ఎన్నో పుకార్లు వచ్చాయి.  ఇది కూడా అలా వచ్చిన పుకారే అయ్యుంటుందని కొట్టిపడేస్తున్నారు. అయితే పుకార్లలో ఎక్కువ శాతం నిజం అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి ఇది కూడా అలా నిజం అవుతుందేమో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: