తెలుగు సినీ పరిశ్రమ వల్ల చాలా మంది ఉపాధి పొందుతారు. కాని కొంత మందికి మాత్రం రోజు గడవటానికి కూడా కష్టం అవుతుంది. వెండి తెర పై తమ నటన తో ఎంతగా అలరించినా వారికి మాత్రం నిజ జీవితంలో చీకట్లు కమ్ముకునే పరిస్థితులు ఎక్కువగానే ఉంటాయి. అగ్ర నటులకు ఈ పరిస్థితి ఉండదు కాని చిన్న చిన్న నటులకు మాత్రం ఇబ్బందే. అయినా వారు నమ్ముకున్న వెండి తెర పై మాత్రం నవ్వులను పూయిస్తారు. అటువంటి వారిలో షకీలా ఒకరు.

 

వెండితెర పై షకీలా ను తెలియని వారుండరు. తన నటన తోనే కాక  అందాలను ఆర బోసి  సిల్క్ స్మిత , జయ మాలిని, జ్యోతి లక్ష్మి వంటి వారి పక్కన చేరి శృంగార తారగా వెలుగొందింది. షకీలా టాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించింది. ఒకప్పుడు దక్షిణ భారత దేశ చలన చిత్ర రంగంలో ఎక్కువ పారితోషికం తీసుకున్న నటి షకీలా. అయినా ఆమె నిజ జీవితంలో మాత్రం చీకట్లు కమ్ముకున్నాయని ఒక  ఇంటర్వ్యూలో తెలిపింది. కేవలం కుటుంబాన్ని పోషించడానికే అలాంటి పాత్రలు చేసానని కాని అందరిని నమ్మడం వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. 

 

షకీలాకు  ఈ పరిస్థితికి కారణం తన సొంత అక్కే. తను షూటింగ్ ల వల్ల బిజీగా ఉండటం తో డబ్బు వ్యవహారం అంతా తన అక్కే చూసుకునేదాని, చివరికి ఆ నమ్మకం కారణంగానే తన అక్క డబ్బంతా నొక్కేసి మోసం చేసిందని కన్నీటి పర్యంతమైనది షకీలా. ఇప్పుడు కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదు. అద్దె ఇంట్లో ఉంటుంది. తను సంపాదించిన డబ్బులో ఒక్క రూపాయి కూడా  వాడుకో లేదు అని , అలా చేసినా ఇంత బాధ ఉండేది కాదని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: