కరోనా మహమ్మారి రోజు రోజుకి విపరీతంగా వ్యాపిస్తున్న కారణంగా దేశ వ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. మళ్ళీ మే 17 వరకు లాక్ డౌన్ ని పొడగించారు. దీంతో మరో రెండు వారాలపాటు అందరూ ఇంటికే పరిమితం అవ్వాల్సిందే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొత్త సినిమాల రిలీజ్‌లు, షూటింగ్‌లు సర్వం బంద్ అయ్యాయి. బహుశా ఇలాంటి సందర్భం ఒకటి వస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరేమో.

 

ఈ కరోనా దెబ్బతో నిర్మాతలు ఇప్పట్లో కోలుకోలేరు. బహుశా సినిమా థియేటర్లకు జనాలు రావాలంటే 2020 లో సాధ్యపడదని తెలుస్తుంది. ఇక ఈ విషయం ప్రముఖ నిర్మాత కూడా వెల్లడించారు. ఆయనే సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు. లాక్ డౌన్ తర్వాత రిలీజ్ కి సిద్దంగా ఉన్న సినిమాలు.. కొత్తగా నిర్మించాలనుకుంటున్న సినిమా నిర్మాతలు ఆచి తూచి వ్యవహరించాలని ఆయన అంటున్నారు.  

 

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తట్టుకొని మళ్ళీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ గాడిలో పడాలంటే స్టార్ హీరోలు, దర్శకులు..మిగతా నటీ నటులు వాళ్ళ రెమ్యునరేషన్స్ తగ్గించుకుంటే బావుంటుందని.. తన అభిప్రాయాన్ని తెలిపారు. నష్టాల్లో ఉన్నప్పుడు చిన్న సంస్థ అయినా పెద్ద సంస్థ అయినా మళ్ళీ లాభాల బాట పట్టాలంటే కొన్ని కాంప్రమైజ్ కాక తప్పదని వెల్లడించారు. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులను తట్టుకోవాలంటే అందరూ సహకరించాలని చెబుతున్నారు. 

 

అయితే ఇదే విషయాన్ని అల్లు అరవింద్ లాంటి ప్రముఖ నిర్మాతలు, నటీనటులు కూడా అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. ఇటీవలే నటుడు ప్రకాష్ రాజ్.. పారితోషికం విషయంలో పెద్ద పెద్ద స్టార్‌లు కాంప్రమైజ్ కావాల్సిందేనని తాను కూడా కచ్చితంగా అవుతానని నిర్మొహమాటంగా చెప్పేశారు. వాస్తవానికి ఇలా చేయకపోతే ఆ హీరోను కాదని వేరే హీరో సినిమా చేసినా తప్పు పట్టాల్సిన అవసరం లేదని వెల్లడించారు. మ‌రి మ‌న హీరోలు, ద‌ర్శకులు పారితోషికం విష‌యంలో ఎంతవరకు కాంప్రమైజ్ అవుతారో చూడాలి.

 

ఇక ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోలు, దర్శకులు తీసుకున్న అడ్వాన్స్‌ల విషయం కూడా కొంతవరకు కాంప్రమైజ్ అయితే సపోర్ట్ చేసినవాళ్ళు అవుతారు అని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో ఎంతమంది సానుకూలంగా వ్యవహరిస్తారో కొంతకాలం ఆగితే క్లారిటి రానుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: