టాలీవుడ్ యువ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ కొట్టడం జరిగింది. వాస్తవానికి కెరీర్ పరంగా గత రెండేళ్లుగా మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ కు ఆ సినిమా విజయంతో సూపర్ గా బ్రేక్ ని అందించింది అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం తనకు ఎంతో ఇష్టమైన డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో హీరోగా నటిస్తున్న అల్లు అర్జున్, ఆ సినిమాని కూడా మంచి సక్సెస్ చేసేలా ఎంతో శ్రమిస్తున్నారు. 

 

ఇక ఇప్పటికే ఆ సినిమాలోని పుష్ప రాజ్ పాత్ర కోసం కొంత గుబురుగా గడ్డం పెంచి మంచి మాస్ లుక్ లో దర్శనం ఇస్తున్న అల్లు అర్జున్, ఆ సినిమాతో పెద్ద టార్గెట్ నే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంతో పెద్ద విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రస్తుతం బాహుబలి రెండు భాగాల కలెక్షన్ తరువాత అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా మూడవ స్థానంలో కొనసాగుతోందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఇటీవల సంక్రాంతి సందర్భంగా వచ్చిన అలవైకుంఠపురములో, సరికిలేరు నీకెవ్వరు సినిమాలు రెండూ కూడా రిలీజ్ అయి మంచి సక్సెస్ ని అందుకున్నప్పటికీ, ఓవరాల్ గా మాత్రం రంగస్థలం టోటల్ కలెక్షన్ ని మాత్రం అవి కొట్టలేకపోయాయని అంటున్నారు. 

 

నిజానికి ఇటీవల ఆ రెండు సినిమాల కలెక్షన్స్ కు సంబంధించి అతిపెద్ద పోస్టర్స్ వార్ జరిగిన విషయం తెలిసిందే. అయితే రంగస్థలం ఇంకా అత్యధిక కలెక్షన్ పొందిన మూడవ సినిమాగా ప్రస్తుతం కొనసాగుతూనే ఉందని చెప్తున్నారు కాబట్టి, తప్పకుండా తమ హీరో ప్రస్తుతం నటిస్తున్న పుష్ప తో రంగస్థలాన్ని కొట్టేయడం ఖాయం అని అర్జున్ ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికీ కూడా అల, సరిలేరు సినిమాల ఫుల్ రన్ కలెక్షన్ గురించి పూర్తి సమాచారం లేదని, కొందరేమో అల సినిమా రంగస్థలాన్ని దాటిందని అంటుంటే, మరికొందరేమో సరిలేరు సినిమానే రంగస్థలాన్ని దాటేసిందని అంటున్నారని, అయితే తమకున్న సమాచారం ప్రకారం మాత్రం ఇంకా రంగస్థలం మూడవ స్థానంలోనే ఉన్నట్లు చెప్తుండడంతో, దానిని అందుకునేలా పుష్ప ఏ మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలని, ఒకరకంగా ఇది పెద్ద టార్గెట్ అని అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: