తెలుగు సినిమాలో చేసినవి తక్కువ సినిమాలే అయినా సరే ఉదయ్ కిరణ్ మాత్రం స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. పక్కింటి అబ్బాయిగా ప్రేక్షకులు కూడా అతన్ని బాగా గుర్తించారు. కెరీర్ మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయాడు. అయితే దాన్ని అతను ఎక్కువగా నిలబెట్టుకోలేదు. అతనికి మంచి కథలు వచ్చినా సరే కొన్ని కొన్ని బాగా ఇబ్బంది పెట్టాయని అతను చాలా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయని అంటున్నారు. అతను కెరీర్ లో పీక్ దశలో ఉన్న సమయంలో కొందరు అతన్ను వేధించారు. 

 

తాము చెప్పింది చేయకపోవడం తో అతనితో కనీసం మాట్లాడకుండా దర్శకులను చేసారని, అతని కోసం మంచి కథలు రెడీ చేసిన దర్శక నిర్మాతలు కూడా అతనితో సినిమా చేయడానికి ముందుకు రాలేదు అని అంటున్నారు. చాలా మంది అతనితో కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదట. మంచి కథలు తీసుకుని వెళ్ళాలి అనుకున్న వాళ్ళను కూడా కొందరు అడ్డుకుని ఉదయ్ కిరణ్ తో సినిమా చేయకుండా చేస్తున్నారు అని కొందరు వార్తలు కూడా రాసారు అప్పట్లో. అతని ఆత్మహత్యకు వాళ్ళే కారణం అనే వాళ్ళు కూడా ఉన్నారు. 

 

అతన్ని కొందరు కొట్టారు అని కూడా చెప్తూ ఉంటారు. దీనికి కారణాలు ఆ కొట్టిన వాళ్లకు బాహ్య ప్రపంచానికి తెలుసు. అతను ఆత్మహత్య చేసుకున్నా సరే కనీసం చూడటానికి వెళ్ళలేదు అని వెళ్ళిన వాళ్ళను కూడా అడ్డుకున్నారని సమాచారం. అందుకే చాలా తక్కువ మంది అతని చివరి చూపు కోసం వెళ్ళారని అంటున్నారు. అతన్ని తెలుగులో స్టార్ హీరో అవుతాడు అని భావించిన వాళ్ళు కూడా చివరికి అతని పరిస్థితి చూసి జాలి పడ్డారు. కెరీర్ లో మంచి కథలు వచ్చినా సరే సినిమాలు చేయలేకపోయాడు. దీనిపై అతని ఫాన్స్ కూడా అప్పట్లో ఒక స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసి కొందరిపై విమర్శలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: