మిల్కీ బ్యూటీ తమన్నా కెరియర్ ఇప్పటికి మంచి ఫామ్ లో ఉందని చెప్పొచ్చు. శ్రీ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు కొద్దిపాటి గ్యాప్ తీసుకుని హ్యాపీడేస్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటినుండి అమ్మడు వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. తెలుగులో దాదాపు అందరి స్టార్స్ తో నటించిన తమన్నా సీనియర్ హీరోలతో కూడా జత కట్టింది. ఓ పక్క హీరోయిన్ గా చేస్తూనే ఐటం సాంగ్స్ కూడా చేస్తూ సత్తా చాటింది అమ్మడు. అయితే సౌత్ లో తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ సినిమాల్లో నటించిన తమన్నా కన్నడలో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. కె.జి.ఎఫ్ సినిమాలో యష్ తో స్పెషల్ సాంగ్ లో నర్తించింది తమన్నా. 


సినిమా హిట్ అవడంతో ఈసారి అక్కడ ఫుల్ లెంగ్త్ మూవీ ఛాన్స్ పట్టేసింది. అది కూడా కె.జి.ఎఫ్ హీరో యష్ చేస్తున్న సినిమానే అని తెలుస్తుంది. కన్నడ క్రేజీ డైరక్టర్ నర్తన్ డైరక్షన్ లో యష్ మరో పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా పేరుని రిఫర్ చేశారట. ఆ మూవీలో అమ్మడు  హీరోయిన్ గా నటించండి ఫైనల్ అని అంటున్నాడు. ప్రస్తుతం కె.జి.ఎఫ్ 2 సినిమా చేస్తున్న యష్ త్వరలో మరో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 


కె.జి.ఎఫ్ 2 కూడా అంచనాలను అందుకుంటే మాత్రం యష్ కూడా పాన్ ఇండియా స్టార్ గా స్టార్ డం తెచ్చుకున్నట్టే. మరి అలంటి స్టార్ సినిమాతో కన్నడ ఎంట్రీ ఇస్తన్న తమన్నా కూడా అక్కడ సత్తా చాటడం ఖాయమని చెప్పొచ్చు. చూస్తుంటే మరో ఐదారేళ్లు తమన్నా తన ఫామ్ కొనసాగించేలా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికే వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ అమ్మడు కన్నడలో కూడా స్టార్ ఛాన్సులు దక్కించుకుంటుంది. సినిమాల్లోకి వచ్చి 15 ఏళ్ళు అవుతుండగా ఇప్పటికి తమన్నా ఏమాత్రం తగ్గట్లేదని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: