కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్తార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సామాజిక సందేశాలని సినిమా ద్వారా చెప్తూనే, ఎలాంటి కమర్షియల్ హంగులని మిస్ కానివ్వకుండా చెప్పే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న కొరటాల శివ, ఈ సినిమాలోనూ సామాజిక సందేశం ఉండేలా చూసుకున్నాడట. కాజల్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రొఫెసర్ గా కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి.

 

 

అయితే ఈ సినిమాలో ఒకానొక కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడని తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్న చరణ్, ఈ సినిమా కోసం రాజమౌళి నుండి ప్రత్యేక అనుమతిని కూడ తెచ్చుకున్నాడు. మొదటగా ఈ పాత్రలో మహేష్ బాబుని అనుకున్నప్పటికీ, చివరగా రామ్ చరణ్ ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాలో చరణ్ ఓ అరగంట పాటు కనిపిస్తాడట.

 

 

అంతే కాదు రామ్ చరణ్ పక్కన హీరోయిన్ కూడా ఉండని వార్తలు వస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే చరణ్ ఈ సినిమాలో కనిపిస్తాడని చెప్పినప్పటి నుండి మెగా మెగా అభిమానుల్లో అంచనాలు బాగా పెరిగాయి. అయితే ఆ అంచనాలని మరింత పెంచడానికా అన్నట్టు కొరటాల చరణ్ తో డాన్సులు వేయించనున్నాడట. చరణ్ కోసమే ప్రత్యేకంగా రెండు పాటల్ని సిధ్ధం చేస్తున్నాడని టాక్.

 

 


నిజానికి ఈ రెండు పాటలు స్క్రిప్ట్లో లేవట. చరణ్ వచ్చాకనే పాటల్ని పెట్టాలనే ఆలోచన వచ్చిందట. చరణ్ ని చూసేందుకు వచ్చే ప్రేక్షకులు అతని డాన్స్ చూడాలని ఆశపడుతుంటారు కాబట్టి, వీటిని పెడుతున్నారని అంటున్నారు. కరోనా కారణంగా షూటింగ్ నిలిపేసిన మొదటి చిత్రమైన ఆచార్య, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత షూటింగ్ జరుపుకోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: